రియల్ మి కొత్త ఫోన్ ఈరోజు ఇండియన్ మార్కెట్ లో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ముందుగా ఇండోనేషియాలో లాంచ్ చేసిన రియల్ మి, ఈరోజు ఇండియాలో కూడా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ 14 pro max లో ఉన్న డైనమిక్ ఐల్యాండ్ వంటి ఫీచర్ ను కలిగి ఉండడం విశేషముగా చెప్పుకోవచ్చు. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ధర, స్పెక్స్ మరియు ఫీచర్లు తెల్సుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
Realme C55: ధర
రియల్ మి సి55 స్మార్ట్ ఫోన్ మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధర వివరాలను క్రింద చూడవచ్చు
ఈ స్మార్ ఫోన్ Pre-Book ఈరోజు సాయంత్రం 6:30 నిముషాలకు ప్రారంభమవుతుంది. C55 స్మార్ట్ ఫోన్ మార్చి 28 మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ కొనేవారికి 1,000 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అయితే, ఈ అఫర్ కేవలం సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ పైన మాత్రమే వర్తిస్తుంది.
Realme C55: స్పెక్స్
రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ 6.72 ఇంచ్ Layar FHD+ స్క్రీన్ ని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. అయితే, ఈ ఫోన్ లో పైన ఉన్న సెల్ఫీలే కెమేరా చుట్టూ ఒక నోటిఫికేషన్ భార్ తో కొత్త ఫీచర్ కనిపిస్తుంది. ఈ బార్ ఫీచర్ ను 'Mini Capsule' గా పిలుస్తోంది. ఈ ఫీచర్ వలన ఫోన్ ప్రీమియం ఫోన్ ఫీల్ మరియు లుక్ ను కలిగివుంది. ఈ స్మార్ట్ ఫోన్ MediaTek Helio G88 ఆక్టా కోర్ ప్రాసెసర్ కి జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ లను అప్షన్ లను కలిగి ఉంటుంది.
కెమెరాల పరంగా, రియల్ మీ C55 స్మార్ట్ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమేరా వుంది. ఇందులో, కేవలం 64MP ప్రైమరీ మరియు 2MP సెకండరీ కెమేరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్ ముందు భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీని 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ Android 13 OS ఆధారితమైన Realme UI 4.0 సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది.