Realme 15 Series సూపర్ AI ఎడిటింగ్ ఫీచర్ AI Edit Gene తో లాంచ్ అవుతోంది.!
Realme 15 Series ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసిన రియల్ మీ
ఈ సిరీస్ యొక్క కీలకమైన ప్రత్యేకతతో ఇప్పుడు టీజింగ్ మొదలు పెట్టింది
AI Edit Gene సూపర్ స్మార్ట్ ఎడిటింగ్ ఫీచర్ తో వస్తున్న రియల్ మీ ఫోన్స్
Realme 15 Series ఇండియా లాంచ్ కన్ఫర్మ్ చేసిన రియల్ మీ ఈ సిరీస్ యొక్క కీలకమైన ప్రత్యేకతతో ఇప్పుడు టీజింగ్ మొదలు పెట్టింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఒక ప్రత్యేకమైన ఫీచర్ గురించి కంపెనీ గొప్పగా టీజింగ్ మొదలు పెట్టింది. అదే, AI Edit Gene సూపర్ స్మార్ట్ ఎడిటింగ్ ఫీచర్. ఈ ఫీచర్ గురించి రియల్ మీ చెబుతున్న గొప్పలు ఏమిటో తెలుసుకోండి.
SurveyRealme 15 Series : లాంచ్
ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. ఇందులో రియల్ మీ 15 5జి మరియు రియల్ మీ 15 ప్రో 5జి రెండు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే, ఇప్పటికీ ఈ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గురించి టీజింగ్ ప్రారంభించింది.
ఈ అప్ కమింగ్ ఫోన్ సిరీస్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. అందుకే, రియల్ మీ 15 సిరీస్ 5జి స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజి అందించి టీజింగ్ చేస్తోంది. ఈ ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ ప్రత్యేకమైన ఫీచర్ గురించి వివరాలు వెల్లడించింది.
Realme 15 Series : సూపర్ AI ఎడిటింగ్ ఫీచర్
రియల్ మీ 15 సిరీస్ నుంచి లాంచ్ చేస్తున్న ఫోన్స్ ప్రత్యేకమైన ఇమేజ్ ఎడిటింగ్ ఫీచర్ తో లాంచ్ అవుతాయని రియల్ మీ తెలిపింది. ఈ ఫీచర్ ను ఎఐ ఎడిట్ జీనీ పేరుతో పిలుస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఎటువంటి ఇతర టూల్ అవసరం లేకుండా కేవలం వాయిస్ కమాండ్ ఇవ్వడం ద్వారా ఇమేజ్ లను యూజర్ కోరుకునే విధంగా ఎడిట్ చేసుకునే వీలుంటుందని రియల్ మీ తెలిపింది.

అంటే, ఈ ఫోన్ లో ఏదైనా ఇమేజ్ ను ఎడిట్ చేయాలంటే జెస్ట్ వాయిస్ కమాండ్ ఇస్తే సరిపోతుంది. ఉదాహరణకు యూజర్ తీసిన ఫోటోను ‘డ్రాప్ మీ ఇన్ టు పార్టీ సీన్’ అని వాయిస్ కమాండ్ ఇవ్వగానే ఫోటో ఆటోమాటిగ్గా పార్టీ సీన్ లోకి మారిపోతుంది. ఈ ఫీచర్ కలిగిన ఇండస్ట్రీ ఫస్ట్ ఫోన్ గా ఈ రియల్ మీ సిరీస్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. దీనికోసం ఈ ఫోన్లు AI Thinking సపోర్ట్ తో పని చేస్తాయని ఈ టీజర్ ఇమేజ్ ద్వారా అర్ధమయ్యేలా చేసింది రియల్ మీ.
Also Read: Honor x9c 5G: అన్ బ్రేకబుల్ డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేసిన హానర్.!
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇండియా లాంచ్ డేట్ తో పాటు ఈ ఫోన్లు కలిగిన మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా రియల్ మీ త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది.