Realme 15 Pro: ట్రిపుల్ 50MP కెమెరా మరియు 4D Curved స్క్రీన్ తో లాంచ్ అవుతోంది.!
రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం సిద్ధమైన కంపెనీ
Realme 15 Pro కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది
ట్రిపుల్ 50MP కెమెరా మరియు 4D Curved స్క్రీన్ తో లాంచ్ చేస్తుంది
Realme 15 Pro: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం సిద్ధమైన కంపెనీ ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తో టీజింగ్ చేస్తోంది. రియల్ మీ 15 సిరీస్ నుంచి 15 మరియు 15 ప్రో రెండు ఫోన్లు లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ అనౌన్స్ చేసింది. వీటిలో, రియల్ మీ 15 ప్రో స్మార్ట్ ఫోన్ ని ట్రిపుల్ 50MP కెమెరా మరియు 4D Curved స్క్రీన్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ గట్టిగా టీజింగ్ చేస్తోంది.
SurveyRealme 15 Pro: లాంచ్
రియల్ మీ 15 సిరీస్ ఫోన్ లు జూలై 24వ తేదీ రాత్రి 7 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్ నుంచి రియల్ మీ 15 మరియు 15 ప్రో రెండు ఫోన్లు లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ యొక్క కీలకమైన ఫీచర్లు కూడా లాంచ్ డేట్ తో పాటు విడుదల చేసింది.
Realme 15 Pro: ఫీచర్స్
రియల్ మీ 15 ప్రో స్మార్ట్ ఫోన్ ను కేవలం 7.69 mm స్లిమ్ బాడీ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ ప్రకటించింది. అయితే, ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉన్నా కూడా ఈ ఫోన్ లో 7000 mAh బిగ్ బ్యాటరీ అందిస్తున్నట్లు ఈ ఫోన్ గురించి రియల్ మీ గొప్పగా చెబుతోంది. 15 ప్రో స్మార్ట్ ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 6500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 4D కర్వ్డ్ ప్లస్ స్క్రీన్ తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ 94 శాతం స్క్రీన్ టు బాడీ మరియు గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్ కూడా కలిగి ఉంటుంది.

రియల్ మీ 15 ప్రో స్మార్ట్ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. ఇది గొప్ప AI సపోర్ట్ కలిగిన లేటెస్ట్ చిప్ సెట్ మరియు చాలా వేగంగా ఉండి గొప్ప పెర్ఫార్మెన్స్ కూడా అందిస్తుంది. ఈ ఫోన్ పెర్ఫార్మన్స్ ను మరింత పీక్ లోకి తీసుకువెళ్లే గొప్ప ర్యామ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్ లో అందించే అవకాశం ఉంటుంది.
Also Read: GOAT Sale : Coocaa లేటెస్ట్ 65 ఇంచ్ QLED Smart Tv పై భారీ డిస్కౌంట్ అందుకోండి.!
రియల్ మీ ఈ ఫోన్ ను ట్రిపుల్ 50MP కెమెరా తో అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, ఈ ఫోన్ 60 FPS వద్ద 4K వీడియో షూట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ AI కెమెరా ఫీచర్ తో పాటు కేవలం వాయిస్ కమాండ్ టోన్ AI ద్వారా ఫోటోలను ఎడిట్ చేసే ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 7000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ ప్రకటించింది. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ కూడా ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే అనౌన్స్ చేసే అవకాశం ఉంది.