Realme 15 Pro 5G: లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ రివీల్ చేసిన రియల్ మీ.!
రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ ఈరోజు అనౌన్స్ చేసింది
రియల్ మీ 15 మరియు 15 ప్రో 5జి రెండు ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది
ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ తో ఫస్ట్ లుక్ ను బయటపెట్టింది
Realme 15 Pro 5G: రియల్ మీ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ నుంచి రియల్ మీ 15 మరియు రియల్ మీ 15 ప్రో 5జి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ తో ఫస్ట్ లుక్ ను బయటపెట్టింది.
SurveyRealme 15 Pro 5G: లాంచ్
రియల్ మీ 15 మరియు 15 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ లను జూలై 24వ తేదీ సాయంత్రం 7 గంటలకు లాంచ్ చేయబోతున్నట్లు రియల్ మీ కన్ఫర్మ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా ప్రకటించింది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజి అందించింది టీజింగ్ చేస్తోంది.
Realme 15 Pro 5G: ఫీచర్లు
రియల్ మీ 15 మరియు రియల్ మీ 15 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ ను కంపెనీ అందించింది. ఈ ఇమేజ్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ కొన్ని రివీల్ చేసింది. ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ మంచి స్లీక్ డిజైన్ తో లాంచ్ అవుతున్నట్లు కన్ఫర్మ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ కర్వుడ్ స్క్రీన్ కలిగి ఉన్నట్లు కూడా అనిపిస్తుంది. ఇది మాత్రమే కాదు ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు కూడా క్లియర్ గా అర్ధం అవుతుంది.

ఈ రియల్ మీ స్మార్ట్ ఫోన్ సిరీస్ ను Next AI సపోర్ట్ ట్ లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్లు ఆరు సూపర్ ఫీచర్స్ కలిగి ఉంటుందని రియల్ మీ టీజింగ్ చేస్తోంది. ఇందులో, స్మార్టర్ AI ఎన్హెన్స్డ్ ఎక్స్ పీరియన్స్, బోల్డర్ డిజైన్ ప్రీమియం ఫీల్, గొప్ప విజువల్స్ అందించే అధిక ప్రకాశవంతమైన స్క్రీన్, వేగవంతమైన ఫాస్ట్ చిప్ సెట్, చాలా సన్నని బాడీలో పెద్ద బ్యాటరీ మరియు చాలా క్లియర్ ఇమేజ్ లను చిత్రించగల క్లియర్ కెమెరా కలిగి ఉంటుంది.
Also Read: OnePlus Buds 4: ప్రీమియం ఫీచర్స్ మరియు యూనిక్ డిజైన్ తో లాంచ్ అయ్యింది.!
రియల్ మీ 15 సిరీస్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ Ai థింకింగ్ తో వస్తుందట. ఈ స్మార్ట్ ఫోన్ తీసిన ఫోటోలు ఎఐ సహాయంతో చాలా సులభంగా ఎడిట్ చేసుకోవచ్చని రియల్ మీ చెబుతోంది. ఇందులో జస్ట్ వాయిస్ కమాండ్ తో ఇమేజ్ లను యూజర్లు కోరుకున్నట్లు ఎడిట్ చేసే అవకాశం ఉంటుందని రియల్ మీ చెబుతోంది. ఈ ఫోన్ ను ఫ్లోయింగ్ సిల్వర్, సిల్క్ పర్పల్, వెల్వెట్ గ్రీన్ మరియు సిల్క్ పింక్ నాలుగు రంగుల్లో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ ప్రకటించింది. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ త్వరలోనే రియల్ మీ వెల్లడిస్తుంది. అప్పుడు ఈ ఫోన్ మరిన్ని అప్‌డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.