భారీ ఆఫర్లతో ఈరోజు నుంచి మొదలైన Realme 13 మరియు 13 ప్లస్ 5జి సేల్.!

HIGHLIGHTS

Realme 13 మరియు 13 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది

ఈ స్మార్ట్ ఫోన్ లను భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో అందించింది

ఈ కొత్త ఫోన్స్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి

భారీ ఆఫర్లతో ఈరోజు నుంచి మొదలైన Realme 13 మరియు 13 ప్లస్ 5జి సేల్.!

రియల్ మీ సరికొత్తగా విడుదల చేసిన Realme 13 మరియు 13 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ లను భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లతో అందించింది. ఈ కొత్త ఫోన్ లను లేటెస్ట్ 5జి చిప్ సెట్, గొప్ప కెమెరా మరియు మరిన్ని ఇతర ఫీచర్ లతో మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్స్ ధర మరియు ఫీచర్లు తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Realme 13 మరియు 13 ప్లస్ : ప్రైస్

Realme 13 స్మార్ట్ ఫోన్ ను రూ. 17,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. రియల్ మీ 13 ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ ను రూ. 22,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా ఈరోజు నుంచి Flipakrt మరియు realme.com నుంచి సేల్ అవుతున్నాయి.

Realme 13 మరియు 13 ప్లస్ : ఆఫర్స్

రియల్ మీ 13 స్మార్ట్ ఫోన్ పై రూ. 1,000 ఆల్ క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ ఆఫర్ ను ప్రకటించింది. అలాగే, రియల్ మీ 13 స్మార్ట్ ఫోన్ పై రూ. 1,500 ఆల్ క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ ఆఫర్ ను ప్రకటించింది.

Also Read: BSNL PLAN: బడ్జెట్ ధరలో డైలీ అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఇదే.!

రియల్ మీ 13 మరియు 13 ప్లస్ : ఫీచర్స్

రియల్ మీ 13 మరియు 13 పలు స్మార్ట్ ఫోన్ లు 6.67 ఇంచ్ FHD+ స్క్రీన్ తో వచ్చాయి. అయితే, వీటిలో 13 ప్లస్ మాత్రం AMOLED స్క్రీన్ తో వస్తుంది. అలాగే, 13 ప్లస్ ఫోన్ Dimensity 7300 Energy చిప్ సెట్ తో వస్తే, రియల్ మీ 13 మాత్రం Dimensity 6300 చిప్ సెట్ తో పని చేస్తుంది. రియల్ మీ 13 కేవలం 8GB ర్యామ్ మాత్రమే వస్తుంది. అయితే రియల్ మీ 13 ప్లస్ మాత్రం 12GB ర్యామ్ వేరియంట్ తో కూడా వస్తుంది.

Realme 13 and Realme 13 plus 5g specs

రియల్ మీ 13 ఫోన్ లో వెనుక 50MP + 2MP డ్యూయల్ కెమెరా మరియు 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రియల్ మీ 13 ప్రో స్మార్ట్ ఫోన్ లో 50MP Sony LYT 600 మెయిన్ + 2MP సెన్సార్ తో డ్యూయల్ రియర్ కెమెరా మరియు 16MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. రియల్ మీ 13 ప్రో భారీ 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ తో వస్తే, రియల్ మీ 13 మాత్రం 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీతో వస్తుంది.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile