BSNL PLAN: బడ్జెట్ ధరలో డైలీ అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఇదే.!

HIGHLIGHTS

బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం గొప్ప అన్లిమిటెడ్ ప్లాన్ ను అందించింది

ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది

ఈ ప్లాన్ చాలా చవక ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కూడా అందిస్తుంది

BSNL PLAN: బడ్జెట్ ధరలో డైలీ అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఇదే.!

BSNL PLAN: బిఎస్ఎన్ఎల్ యూజర్ల కోసం గొప్ప అన్లిమిటెడ్ ప్లాన్ ను అందించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ ధరలో అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది. అంతేకాదు, ఈ ప్లాన్ చాలా చవక ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కూడా అందిస్తుంది. బిఎస్ఎన్ఎల్ యూజర్లకు ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ అందించే ప్రయోజనాలు తెలుసుకోండి.!

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటి ఆ BSNL PLAN?

45 రోజుల వ్యాలిడిటీ తో వచ్చే బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ ఈ బెనిఫిట్స్ అందిస్తుంది. ఏఈ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డేట్ వంటి అన్ని ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

బిఎస్ఎన్ఎల్ రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ 45 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది. 45 రోజుల వ్యాలిడిటీ కాలానికి గాను అన్ని నెట్వర్క్ లకు అనిలిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం అందిస్తుంది ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు డైలీ 2GB డేటాని అందుకుంటారు. ఈ రోజు వారి డేటా లిమిట్ ముగిసిన తరువాత 40kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా సౌలభ్యం కూడా అందుతుంది.

ఇది కాకుండా ఈ ప్లాన్ తో డైలీ 100 SMS వినియోగ సౌలభ్యం కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అందించే బిఎస్ఎన్ఎల్ బెస్ట్ బడ్జెట్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది.

Also Read: New Earbuds Launched: చాలా చవక ధరలో Hi-Res ANC బడ్స్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్.!

ఇలాంటి అన్లిమిటెడ్ ప్రయోజనాలతో బడ్జెట్ ధరలో ఎక్కువ రోజులు చెల్లుబాటు అయ్యే మరొక ప్లాన్ కూడా ఉంది. అదే బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 298 ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.

BSNL PLAN

బిఎస్ఎన్ఎల్ రూ. 298 ప్రీపెయిడ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 298 ప్రీపెయిడ్ ప్లాన్ 52 రోజుల వ్యాలిడిటీ తోవస్తుంది. ఈ ప్లాన్ కూడా 52 రోజుల పాటు అన్ని నెట్ వర్క్ లకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ రోజుకు కేవలం 1GB హై స్పీడ్ డేటా మాత్రమే అందిస్తుంది. కానీ, డైలీ డేటా ముగిసిన తర్వాత కూడా 40kbps స్పీడ్ తో అన్లిమిటెడ్ డేటా వినియోగ అవకాశం లభిస్తుంది. ఈ ప్లాన్ తో డైలీ 100 SMS సౌకర్యం కూడా అంధిస్తుంది.

మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ చెక్ చేయడానికి మరియు రీఛార్జ్ చేయడానికి Click Here

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo