New Earbuds Launched: చాలా చవక ధరలో Hi-Res ANC బడ్స్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్.!

New Earbuds Launched: చాలా చవక ధరలో Hi-Res ANC బడ్స్ లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్.!

New Earbuds Launched: ప్రముఖ ఆడియో మాన్యుఫాక్చరింగ్ టెక్ బ్రాండ్ MIVI ఈరోజు మార్కెట్ లో కొత్త బడ్స్ ను విడుదల చేసింది. ఈ బడ్స్ ను చాలా చవక ధరలో Hi-Res Wireless మరియు ANC ఫీచర్స్ తో లాంచ్ చేసింది. అంతేకాదు, ఈ బడ్స్ ఎన్ హెన్ వీడియో క్వాలిటీ అందిస్తుందని జపనీస్ ఆడియో సొసైటీ అప్రూవ్ అందుకున్నట్లు కూడా మివి తెలిపింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

New Earbuds Launched

మివి బ్రాండ్ ఈరోజు MIVI Opera ANC బడ్స్ పేరుతో కొత్త ఇయర్ బడ్స్ ను లాంచ్ చేసింది. ఈ బడ్స్ ను కేవలం రూ. 1,999 ధరతో లాంచ్ చేసింది. మివి సరికొత్తగా విడుదల చేసిన ఈ బడ్స్ సెప్టెంబర్ 10 వ తేదీ నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్స్ అమెజాన్ ఇండియా నుంచి సేల్ అవుతాయి.

MIVI Opera ANC : ఫీచర్స్

మివి యొక్క ఈ లేటెస్ట్ ఇయర్ బడ్స్ వైబ్రాంట్ షేడ్స్ మరియు ఐకానిక్ స్టైల్ తో లాంచ్ అయ్యాయి. ఈ బడ్స్ Hi Res Audio Wireless ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ను కలిగి వుంది. ఈ హాయ్ క్వాలిటీ సౌండ్ అందించేలా LDAC కోడాక్ ఫీచర్ ను కూడా కలిగి వుంది. ఈ బడ్స్ ఎన్ హెన్ వీడియో క్వాలిటీ అందిస్తుందని, పనీస్ ఆడియో సొసైటీ అప్రూవ్ ను పొందనట్లు కూడా మివి తెలిపింది.

MIVI New Earbuds Launched

ఇక ఈ బడ్స్ మెయిన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ బడ్స్ లో 32dB ANC సపోర్ట్ వుంది మరియు Transparency మోడ్ తో కూడా వస్తుంది. ఈ మివి బడ్స్ 3D Sound Stage తో ఉన్నతమైన సౌండ్ అందిస్తుందని కూడా మివి వెల్లడించింది. ఈ ఓపెరా ANC బడ్స్ లేటెస్ట్ Bluetooth 5.4 సపోర్ట్ తో వస్తుంది మరియు Spatial Audio సపోర్ట్ ను కూడా కలిగి వుంది.

Also Read : Vivo T3 Ultra 5G లాంచ్ అనౌన్స్ చేసిన వివో.. ఫోన్ ఎలా ఉందంటే.!

ఈ బడ్స్ పూర్తిగా Made in India ప్రోడక్ట్ అని కూడా మివి గర్వంగా చెబుతోంది. ఈ బడ్స్ మల్టీ డివైజ్ కనెక్టివిటీ తో వస్తుంది మరియు అడ్వాన్స్డ్ ఈక్వలైజర్ కలిగిన Mivi Audio App సపోర్ట్ తో కూడా జతగా వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo