Vivo T3 Ultra 5G స్మార్ట్ ఫోన్ త్వరలోనే ఇండియాలో లాంచ్ అవుతుందని నిన్న మొన్నటి వరకు నెట్టింట్లో రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే, వీటన్నిటికీ పుల్ స్టాప్ పెడుతూ వివో ఈ ఫోన్ లాంచ్ గురించి ప్రకటించింది. ఈ ఫోన్ డిజైన్ తో కూడిన ఇమేజ్ తో ఈ ఫోన్ లాంచ్ గురించి టీజింగ్ మొదలు పెట్టింది.
Survey
✅ Thank you for completing the survey!
Vivo T3 Ultra 5G లాంచ్
వివో టి3 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేయబొతున్నల్టు వివో ప్రకటించింది. ఈ ఫోన్ కోసం Flipkart ను సేల్ పార్ట్నర్ గా ప్రకటించింది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రో సైట్ టీజర్ పేజ్ ను కూడా అందించింది.
వివో టి3 అల్ట్రా 5జి స్మార్ట్ ఫోన్ యొక్క టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ కర్వుడ్ స్క్రీన్ తో వస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో Aura లైట్ ఫ్లాష్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. ఈ వివో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ డిజైన్ కెమెరా మరియు కొత్త ప్రీమియం కెమెరా మోడ్యూల్ తో వస్తున్నట్లు కనిపిస్తోంది.
ఈ ఫోన్ మరిన్ని కీలకమైన ఫీచర్స్ ను కూడా వివో అందించింది. ఈ అప్ కమింగ్ ఫోన్ 80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500 mAh బిగ్ బ్యాటరీ తో వస్తుందట. ఈ ఫోన్ కేవలం 7.5mm మందంతో చాలా సన్నగా ఉంటుందని కూడా వివో తెలిపింది. టి 3 అల్ట్రా ఫోన్ 12GB ర్యామ్ మరియు 12GB ఎక్స్టెండెడ్ ర్యామ్ తో రాబోతున్నట్లు కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఫోన్ లో 3D కర్వుడ్ AMOLED స్క్రీన్ ఉంటుంది మరియు ఈ ఫోన్ లో Sony ఫ్లాగ్ షిప్ కెమెరా ఉన్నట్లు కూడా వివో కన్ఫర్మ్ చేసింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile