Realme 11x 5G: రియల్ మి లేటెస్ట్ బడ్జెట్ 5G ఫోన్ ధర మరియు టాప్ ఫీచర్లు తెలుసుకోండి.!

HIGHLIGHTS

తక్కువ ధరలో విడుదలైన Realme 11x 5G స్మార్ట్ ఫోన్

15 వేల సబ్ కేటగిరిలో ఆకట్టుకునే ఫీచర్లతో Realme 11x 5G లాంచ్

Early Bird సేల్ ఈరోజు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు జరగనున్నది

రియల్ మి ఈరోజు ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్లతో పాటుగా ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేసింది. ఇందులో, realme 11x 5G స్మార్ట్ ఫోన్ తక్కువ ధరలో విడుదలైన 5G స్మార్ట్ ఫోన్.  రియల్ మి ఈ స్మార్ట్ ఫోన్ 15 వేల సబ్ కేటగిరిలో ఆకట్టుకునే ఫీచర్లతో లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్ లో రియల్ మి ఈరోజే లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ధర మరియు టాప్ ఫీచర్లు తెలుసుకుందాం. 

Realme 11x 5G: ధర

Realme 11x 5G స్మార్ట్ ఫోన్ ను రూ. 14,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది 6GB + 128GB స్టోరేజ్ కోసం నిర్ణయించిన ధర మరియు 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999 గా నిర్ణయించింది. 11X 5G స్మార్ట్ ఫోన్ Early Bird సేల్ ఈరోజు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు జరగనున్నది. 

Realme 11x 5G ఫోన్ పైన లాంచ్ అఫర్ లో భాగంగా రూ. 500 కూపన్ మరియు రూ. 500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను అందించింది.

Realme 11x 5G: ప్రత్యేకతలు

Realme 11x 5G ఫోన్ 6.72 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ రియల్ మి 5G ఫోన్ Dimensity 6100+ 5G ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 6/8GB ర్యామ్ తో పాటుగా డైనమిక్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ realme UI 4.0 సాఫ్ట్ వేర్ పైన Android 13 OS తో నడుస్తుంది. 

ఈ ఫోన్ లో ఫ్లాష్ తో కూడిన AI డ్యూయల్ రియర్ కెమేరా వుంది. ఈ డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ లో 64MP AI మెయిన్ కెమేరా మరియు 2MP పోర్ట్రైట్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ లో ముందు 8MP సెల్ఫీ కెమేరా వుంది మరియు 1080p వీడియో రికార్డ్ చేయగలదు. ఈ ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీని రియల్ మి అందించింది.

 

https://twitter.com/realmeIndia/status/1694275531615936730?ref_src=twsrc%5Etfw

 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :