రియల్ మి ఈరోజు ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్లతో పాటుగా ఇయర్ బడ్స్ ను కూడా లాంచ్ చేసింది. ఇందులో, realme 11x 5G స్మార్ట్ ఫోన్ తక్కువ ధరలో విడుదలైన 5G స్మార్ట్ ఫోన్. రియల్ మి ఈ స్మార్ట్ ఫోన్ 15 వేల సబ్ కేటగిరిలో ఆకట్టుకునే ఫీచర్లతో లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్ లో రియల్ మి ఈరోజే లేటెస్ట్ గా విడుదల చేసిన ఈ సరికొత్త స్మార్ట్ ఫోన్ ధర మరియు టాప్ ఫీచర్లు తెలుసుకుందాం.
Realme 11x 5G స్మార్ట్ ఫోన్ ను రూ. 14,999 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది 6GB + 128GB స్టోరేజ్ కోసం నిర్ణయించిన ధర మరియు 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999 గా నిర్ణయించింది. 11X 5G స్మార్ట్ ఫోన్ Early Bird సేల్ ఈరోజు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు జరగనున్నది.
Realme 11x 5G ఫోన్ పైన లాంచ్ అఫర్ లో భాగంగా రూ. 500 కూపన్ మరియు రూ. 500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ ను అందించింది.
Realme 11x 5G: ప్రత్యేకతలు
Realme 11x 5G ఫోన్ 6.72 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ రియల్ మి 5G ఫోన్ Dimensity 6100+ 5G ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 6/8GB ర్యామ్ తో పాటుగా డైనమిక్ ర్యామ్ సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ realme UI 4.0 సాఫ్ట్ వేర్ పైన Android 13 OS తో నడుస్తుంది.
ఈ ఫోన్ లో ఫ్లాష్ తో కూడిన AI డ్యూయల్ రియర్ కెమేరా వుంది. ఈ డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ లో 64MP AI మెయిన్ కెమేరా మరియు 2MP పోర్ట్రైట్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ లో ముందు 8MP సెల్ఫీ కెమేరా వుంది మరియు 1080p వీడియో రికార్డ్ చేయగలదు. ఈ ఫోన్ లో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5000mAh బ్యాటరీని రియల్ మి అందించింది.
It's the dawn of a new era of innovation! The exceptional #realme11X5G is all set to democratize the world of 5G. This ultimate smartphone experience is going live on 30th Aug, at noon. You can get the 6GB+128GB variant @ ₹14999 or the 8GB+128GB one @ ₹15999. Stay tuned! pic.twitter.com/lNXclMYs2u