POCO M8x 5G launched with tablet like big display and big battery
POCO M8x 5G ట్యాబ్లెట్ లాంటి బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం గత వారం రోజులుగా టీజింగ్ చేసిన పోకో, ఎట్టకేలకు ఈరోజు ఈ ఫోన్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ వేగాన్ లెథర్ బ్యాక్ మరియు మరిన్ని ఇతర ఫీచర్స్ తో వచ్చింది. ఈ లేటెస్ట్ ఫోన్ ప్రైస్, లాంచ్ ఆఫర్లు మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
పోకో ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను రెండు ర్యామ్ అండ్ స్టోరేజ్ వేరియంట్స్ లో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ 4GB + 128GB స్టోరేజ్ బేసిక్ వేరియంట్ ని రూ. 20,999 రూపాయల ప్రైస్ తో మరియు 4GB + 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 22,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లెథర్ గ్రీన్, బ్లాక్ మరియు బ్లూ మూడు రంగుల్లో లాంచ్ అయ్యింది.
ఈ స్మార్ట్ ఫోన్ పై ఆకట్టుకునే లాంచ్ ఫీచర్స్ కూడా అందించింది. ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్లతో ఈ ఫోన్ కేవలం రూ. 18,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ ఆగస్టు 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది.
Also Read: Jio 299 Plan: యూజర్లకు గుడ్ న్యూస్ అందించిన రిలయన్స్ జియో.!
ఈ పోకో స్మార్ట్ ఫోన్ మెటాలిక్ మిడిల్ వేగాన్ లెథర్ ఫినిష్ మరియు క్వాడ్ కర్వుడ్ బ్యాక్ డిజైన్ తో వస్తుంది. 6.9 ఇంచ్ బిగ్ స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ ని గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ తో అందించింది. అలాగే, షియోమీ హైపర్ ఐలాండ్, HD + రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ వంటి ఫీచర్స్ కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ క్వాల్కమ్ యొక్క లేటెస్ట్ 5జి చిప్ సెట్ Snapdragon 4 Gen 5 తో నడుస్తుంది మరియు జతగా 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఇది మంచి పెర్ఫార్మెన్స్ అందించే బడ్జెట్ 4nm చిప్ సెట్ మరియు నెక్స్ట్ జనరేషన్ AI సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో సెటప్ మరియు Hi-Res ఆడియో సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS తో లాంచ్ అయ్యింది. అయితే, ఈ ఫోన్ 4 జనరేషన్ OS అప్గ్రేడ్ మరియు 6 సంవత్సరాల రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ సపోర్ట్ తో వస్తుంది.
కెమెరా పరంగా, ఈ ఫోన్ లో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఇది FHD వీడియో రికార్డింగ్ మరియు ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను భారీ 7900 mAh హెవీ బి బ్యాటరీతో పోకో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను వేగంగా ఛార్జ్ చేసే 45W ఫాస్ట్ ఛార్జ్ మరియు 22.5W రివర్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో కూడా వస్తుంది.