Poco M8x 5G india launch date and features confirmed
Poco M8x 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్లను కూడా కొత్త టీజర్ ద్వారా రిలీజ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ క్వాల్కమ్ పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు 12GB ర్యామ్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో విడుదల చేయబోతున్నట్లు పోకో కొత్తగా టీజింగ్ చేసింది. ఈ అప్ కమింగ్ పోకో స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.
పోకో ఎం8x స్మార్ట్ ఫోన్ ను ఆగష్టు 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు పోకో అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ రివీల్ చేసింది.
పోకో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ‘పవర్ కా స్వాగ్’ ట్యాగ్ లైన్ తో టీజింగ్ చేసింది. అంటే, ఈ ఫోన్ ను అన్ని విభాగాల్లో పవర్ ఫుల్ ఫీచర్స్ తో అందిస్తుందని చెబుతోంది. కొత్తగా ఈ ఫోన్ టీజర్ పేజీ నుంచి అందించిన ఫీచర్స్ కూడా ఈ మాటకు తగ్గట్టుగా ఉన్నాయి. ఈ ఫోన్ ను స్లీక్ డిజైన్ మరియు వెనుక వేగాన్ లెథర్ బ్యాక్ ప్యానల్ మరియు పెద్ద కెమెరా బంప్ డిజైన్ లో లాంచ్ చేస్తుంది.
ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 4 Gen 5 తో లాంచ్ చేస్తున్నట్లు పోకో అనౌన్స్ చేసింది. ఇది 4nm టెక్నాలజీ పై పని చేసే ప్రాసెసర్ మరియు గరిష్టంగా 6,50,000 కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది. అంతేకాదు, ఈ చిప్ సెట్ తో ఇండియాలో విడుదలయ్యే మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఇది నెక్స్ట్ జనరేషన్ AI సత్తా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.
ఈ వేగవంతమైన చిప్ సెట్ తో జతగా LPDDR4X 6GB ఫిజికల్ ర్యామ్ మరియు 6GB వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. అంతేకాదు, బిగ్ UFS 2.2 ఫాస్ట్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే సెటప్ కూడా ఉంటుంది. అదేమిటంటే, ఈ ఫోన్ లో అల్ట్రా లార్జ్ గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా కూడా ఉంటుంది.
Also Read: Philips Dolby సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!
ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ కూడా ఒక్కొక్కటిగా పోకో రివీల్ చేస్తుంది. ఈ ఫోన్ కొత్త ఫీచర్స్ అప్‌డేట్ టి మళ్ళీ కలుద్దాం.