Poco M8x 5G లాంచ్ డేట్ అండ్ టాప్ ఫీచర్స్ రిలీజ్ .. 12GB ర్యామ్ తో వస్తోంది.!

HIGHLIGHTS

Poco M8x 5G లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్లను కూడా కొత్త టీజర్ ద్వారా రిలీజ్ చేసింది

12GB ర్యామ్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో విడుదల చేయబోతున్నట్లు పోకో కొత్తగా టీజింగ్ చేసింది

Snapdragon 4 Gen 5 తో లాంచ్ చేస్తున్నట్లు పోకో అనౌన్స్ చేసింది

Poco M8x 5G లాంచ్ డేట్ అండ్ టాప్ ఫీచర్స్ రిలీజ్ .. 12GB ర్యామ్ తో వస్తోంది.!

Poco M8x 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్లను కూడా కొత్త టీజర్ ద్వారా రిలీజ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను లేటెస్ట్ క్వాల్కమ్ పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు 12GB ర్యామ్ వంటి ఆకట్టుకునే ఫీచర్స్ తో విడుదల చేయబోతున్నట్లు పోకో కొత్తగా టీజింగ్ చేసింది. ఈ అప్ కమింగ్ పోకో స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ పై ఒక లుక్కేద్దామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Poco M8x 5G: లాంచ్ డేట్ ఏమిటి?

పోకో ఎం8x స్మార్ట్ ఫోన్ ను ఆగష్టు 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు పోకో అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ రివీల్ చేసింది.

Poco M8x 5G: ఫీచర్స్

పోకో ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ‘పవర్ కా స్వాగ్’ ట్యాగ్ లైన్ తో టీజింగ్ చేసింది. అంటే, ఈ ఫోన్ ను అన్ని విభాగాల్లో పవర్ ఫుల్ ఫీచర్స్ తో అందిస్తుందని చెబుతోంది. కొత్తగా ఈ ఫోన్ టీజర్ పేజీ నుంచి అందించిన ఫీచర్స్ కూడా ఈ మాటకు తగ్గట్టుగా ఉన్నాయి. ఈ ఫోన్ ను స్లీక్ డిజైన్ మరియు వెనుక వేగాన్ లెథర్ బ్యాక్ ప్యానల్ మరియు పెద్ద కెమెరా బంప్ డిజైన్ లో లాంచ్ చేస్తుంది.

Poco M8x 5G Launch date and features

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 4 Gen 5 తో లాంచ్ చేస్తున్నట్లు పోకో అనౌన్స్ చేసింది. ఇది 4nm టెక్నాలజీ పై పని చేసే ప్రాసెసర్ మరియు గరిష్టంగా 6,50,000 కంటే అధిక AnTuTu స్కోర్ అందిస్తుంది. అంతేకాదు, ఈ చిప్ సెట్ తో ఇండియాలో విడుదలయ్యే మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఇది నెక్స్ట్ జనరేషన్ AI సత్తా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఈ వేగవంతమైన చిప్ సెట్ తో జతగా LPDDR4X 6GB ఫిజికల్ ర్యామ్ మరియు 6GB వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. అంతేకాదు, బిగ్ UFS 2.2 ఫాస్ట్ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ను వేగంగా చల్లబరిచే సెటప్ కూడా ఉంటుంది. అదేమిటంటే, ఈ ఫోన్ లో అల్ట్రా లార్జ్ గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా కూడా ఉంటుంది.

Also Read: Philips Dolby సౌండ్ బార్ పై జబర్దస్త్ డిస్కౌంట్ అందించిన అమెజాన్.!

ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ కూడా ఒక్కొక్కటిగా పోకో రివీల్ చేస్తుంది. ఈ ఫోన్ కొత్త ఫీచర్స్ అప్‌డేట్ టి మళ్ళీ కలుద్దాం.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile