POCO M8x 5G first day sale started with huge launch discount offers
పోకో గత వారం భారత మార్కెట్ లో విడుదల చేసిన లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ POCO M8x 5G ఫస్ట్ డే సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ వేగన్ లెథర్ బ్యాక్ ప్యానల్, స్లీక్ డిజైన్ మరియు భారీ బ్యాటరీ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఈరోజు మొదటిసారి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్ నుంచి ఈ ఫోన్ ను గొప్ప లాంచ్ ఆఫర్స్ తో బెస్ట్ ప్రైస్ లో అందుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్ లిమిటెడ్ పిరియడ్ ఆఫర్ కాబట్టి కొన్ని రోజులు మాత్రమే లభిస్తుంది.
పోకో ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ను 4జీబీ ర్యామ్ జత 128జీబీ స్టోరేజ్ తో రూ. 20,999 ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6జీబీ ర్యామ్ మరియు 128జీబీ స్టోరేజ్ హైఎండ్ వేరియంట్ ను రూ. 22,999 ధరలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది. ఈ ఫోన్ బ్లాక్, లెథర్ మరియు గ్రీన్ బ్లూ మూడు కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
ఇక ఈ ఫోన్ పై కంపెనీ అందించిన లాంచ్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 2,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఈ ఆఫర్ తో ఈ ఫోన్ కేవలం రూ. 18,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. ఇది కాకుండా ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి రూ. 950 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Also Read: 5.1.4 Dolby Atmos సౌండ్ బార్ బిగ్ డిస్కౌంట్ తో చవక ధరలో లభిస్తోంది.!
ఈ పోకో న్యూ 5జి స్మార్ట్ ఫోన్ వెనుక వేగాన్ లెథర్ కలిగిన బ్యాక్ ప్యానల్ మరియు స్లీక్ డిజైన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ పెద్ద 6.9 ఇంచ్ స్క్రీన్ ను HD రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. అయితే, ఈ స్క్రీ ని గొరిల్లా గ్లాస్ 7i రక్షణతో అందించింది. పోకో ఈ ఫోన్ ను Snapdragon 4 Gen 5 ప్రాసెసర్ తో 4జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ స్టోరేజ్ తో అందించింది. ఈ ఫోన్ లో విజువల్స్ తగిన ఆడియో అందించే విధంగా Hi-Res ఆడియో సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 50MP AI డ్యూయల్ రియర్ అండ్ 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఇది FHD వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో పాటు లేటెస్ట్ ఏఐ కెమెరా ఫీచర్స్ తో వస్తుంది. భారీ 7900 mAh బిగ్ బ్యాటరీతో పోకో ఈ ఫోన్ ను అందించింది. అలాగే, 45W ఫాస్ట్ ఛార్జ్ మరియు 22.5W రివర్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ ఫీచర్ ని కూడా పోకో ఇందులో అందించింది. ఇది డస్ట్ వాటర్ రెసిస్టెంట్ కోసం IP64 రేటింగ్ కలిగి ఉంటుంది.