Poco నుండి నవంబర్ నెలలో యురేపియన్ మార్కెట్లో లాంచ్ అయిన POCO M3 స్మార్ట్ ఫోన్ మరో రెండు రోజుల్లో అంటే జనవరి 21 న ఆసియాలోని కొన్ని మార్కెట్లలో లాంచ్ చెయ్యడానికి సిద్ధమవుతోంది. ఇందులో, తైవాన్ మరియు ఇండోనేషియా మార్కెట్లలో విడుదల చేస్తోంది. అయితే, ముకుల్ శర్మ చేసిన ట్వీట్ ని గమనిస్తే మాత్రం పోకో M3 స్మార్ట్ ఫోన్ ను ఫిబ్రవరి నెలలలో ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావచ్చని అర్ధమవుతుంది. కానీ, సంస్థ మాత్రం ఇప్పటి వరకు దీని గురించిన ఎటువంటి సమాచారాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
Survey
✅ Thank you for completing the survey!
వాస్తవానికి, ముకుల్ శర్మ చేసిన ట్వీట్ లో పోకో M3 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ, POCO M3 స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఫిబ్రవరి నెల గురించి ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే, ఈ POCO M3 ఫిబ్రవరి నెలలో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించవచ్చని ఊహిస్తున్నారు. కానీ, దీని గురించి ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు.
గ్లోబల్ POCO M3 స్పెషిఫికేషన్ల పరంగా, క్వాల్కమ్ కొత్తగా ప్రకటించిన స్నాప్ డ్రాగన్ 662 ఆక్టా కోర్ ప్రోసెసర్, పెద్ద 6.53 FHD+ రిజల్యూషన్ డిస్ప్లే తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, పెద్ద 6000 mAh బ్యాటరీని 22.5 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది. కెమెరా విషయానికి వస్తే, వెనుక 48MP AI ట్రిపుల్ రియర్ కెమెరాని, ముందు సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని కలిగి వుంటుంది.