HIGHLIGHTS
POCO M3 స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్
పోకో M3 Adreno 610 GPU తో వస్తుంది
POCO M3 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 ఆక్టా కోర్ ప్రొసెసర్ ని కలిగి వుంది
ఇటీవల ఇండియాలో మంచి ఫీచర్లతో వచ్చిన POCO M3 స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ ఈరోజు జరగనుంది. ఈ స్మార్ట్ ఫోన్ కొత్త డిజన్ తో పాటుగా, స్నాప్ డ్రాగన్ 662 ప్రొసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా వంటి మరిన్ని ప్రత్యేకతలతో విడుదల చెయ్యబడింది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart నుండి మొదలవుతుంది.
SurveyPOCO M3 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.53 అంగుళాల FHD+ డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే19.5:9 ఎస్పెక్ట్ రేషియో మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 ఆక్టా కోర్ ప్రొసెసర్ ని కలిగి వుంది. ఇది Adreno 610 GPU తో వస్తుంది మరియు 6GB ర్యామ్ మరియు 64GB /128GB స్టోరేజ్ అప్షన్లతో వస్తుంది. స్టోరేజ్ ను మరింతగా పెంచుకోవడానికి SD కార్డు అప్షన్ కూడా ఇవ్వబడింది.
పోకో M3 లోని కెమెరాల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ వుంది. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ లో 48MP ప్రధాన కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మ్యాక్రో సెన్సార్ వున్నాయి. ఈ ఫోన్ ముందుభాగంలో సెల్ఫీల కోసం సెల్ఫీ కెమెరాని వాటర్ డ్రాప్ నోచ్ లో అందించింది. ఇందులో, 8MP సెన్సార్ ని ఉంచింది. స్మార్ట్ ఫోన్ మొత్తానికి పవర్ అందించడాని అతిపెద్ద 6,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అందించింది.
పోకో M3 స్మార్ట్ ఫోన్ 6GB ర్యామ్ కి జతగా 64GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 10,999 రూపాయల ధరతో, 6GB ర్యామ్ కి జతగా 128GB స్టోరేజ్ వేరియంట్ ను రూ. 10,999 రూపాయల ధరతో విడుదల చేసింది. POCO M3 ఫిబ్రవరి 9 నుండి Flipkart లో కొనడానికి అందుబాటులో వుంటుంది.