పోకో ఎఫ్1,స్నాప్ డ్రాగన్ 845 తో పనిచేసే స్మార్ట్ ఫోన్లలో ప్రపంచలోనే అత్యంత చావుకైనదిగా షియోమీ చేత విదుదల చేయబడింది, దీని ప్రారంభధర రూ . 20,999

పోకో ఎఫ్1,స్నాప్ డ్రాగన్ 845 తో పనిచేసే స్మార్ట్ ఫోన్లలో ప్రపంచలోనే అత్యంత చావుకైనదిగా    షియోమీ చేత విదుదల చేయబడింది, దీని ప్రారంభధర రూ . 20,999
HIGHLIGHTS

పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్ ఒక లిక్విడ్ కూలింగ్ సాంకేతికతతో వస్తుంది. తీవ్రమైన కాల్ సెషన్ చేస్తున్నపుడు CPU ని చల్లగా ఉంచడానికి సహాయపడే ఒక రాగి గొట్టం ఫోన్ లోపల ఉందని కంపెనీ పేర్కొంది.

షియోమీ ఇప్పుడు ప్రధానమైన స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో ప్రపంచంలోని చౌకైన ఫోన్ గా పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్ ని అందిస్తుంది. పోకో మరియు షియోమీ యొక్క కొత్త అనుబందాంతో వచ్చిన పోకో ఎఫ్1 దాని మొదటి స్మార్ట్ ఫోన్ ప్రయోగం కూడాను. అంతేకాకుండా మీ జేబుకు చిల్లు పెట్టకుండానే ఒక శక్తివంతమైన ఫోన్, పోకో ఎఫ్1మీ చేతికి అందుబాటులో ఉంటుంది.  యూజర్ తీవ్రమైన వాడుక సెషన్లలో ఉన్నపుడు కూడా డివైజ్ని చల్లగా ఉంచడానికి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఇందులో అందించారు దీనిని ఇందులోని హైలైటింగ్ ఫీచర్లలో ఒకటిగా చెప్పవచ్చు.  షియోమీ పోకో ఎఫ్1 భారతదేశంలో తయారు చేయబడుతుంది మరియు దేశవ్యాప్తంగా వున్న అన్ని 1000 సర్వీసు కేంద్రాలలో ఇది అంగీకరించబడుతుంది అని ప్రకటించింది.

పోకో ఎఫ్1 మూడు వేరియంట్లలో వస్తుంది అవి: 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజి కోసం రూ .20,999 మరియు 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజి రూ. 23,999. ఇంకా 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజి వెర్షన్ ధర రూ .28,999, 8జీబీ ర్యామ్ + 256GB స్టోరేజితో ప్రత్యేక ఆర్మర్డ్ ఎడిషన్ ధర రూ .29,999 ధరతో అందిస్తుంది కంపెనీ. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు వినియోగదారులకు రూ. 1,000 ల తక్షణ తగ్గింపు ధరతో రూ . 19,999 రూపాయల ధరకు అందనుంది. ఈ ఫోన్ కూడా రూ. 8000 తక్షణ జీయో లాభాలు మరియు 6 టిబి అధిక-వేగం డేటాతో కూడినది. ఒక సూపర్ సాఫ్ట్ కేసు బాక్స్ లో ఇది అందించబడుతుంది. ఈ ఫోన్ ఆగష్టు 29 న మీ.కాం మరియు ఫ్లిప్కార్ట్ లో మధ్యాహ్నం 12 గంటల నుండి అందుబాటులో ఉంటుంది.

పోకోఎఫ్1 స్పెసిఫికేషన్స్

ఈ పోకో ఎఫ్1 క్వాల్కమ్ 845 ఆక్టా కోర్ ప్రాసెస్ శక్తితో పనిచేస్తుంది. పైన తెలిపిన విధంగా,

ఇందులో కాపర్ పైపు ద్వారా ఒక లిక్విడ్ కూల్ టెక్నాలజీ అందించబడింది దీనితో వినియోగదారులు అత్యధికంగా ఫోన్ ని వాడే సమయాలలో కూడా CPU ని చల్లగా ఉండే విధంగా చూస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 19:9 రిజల్యూషన్ గల ఒక 6.18 – అంగుళాల ఫుల్ హెచ్ డి+ IPS LCD డిస్ప్లే ని కలిగివుంది. గొరిల్లా గ్లాస్ తో సురక్షితం చేయబడిన వైడ్ నోచ్ డిస్ప్లే దీనికి అందించారు, ఎందుకంటె ఇందులో  IR లెన్స్ తో చీకటిలో కూడా పేస్ అన్లాక్ ని అందించే విధంగా ఇచ్చారు. ఈ నోచ్ లైటింగ్ సెన్సార్, ఇయర్ పీస్,ఒక 20ఎంపీ సెన్సర్ని ఆఇందులో ఇనుమడించుకొని ఉంది. ఇరుప్రక్కల వున్న బెజెల్స్ సామాన్యంగా ఉన్నాయి మరియు దీని క్రింది భాగం లో ఒక మందపాటి చిన్ ని ఇచ్చారు. కంపెనీ ఇందులో గ్లాస్ బ్యాక్ కాకుండా లేయర్ కలర్ ప్రాసెస్ చేసి మందంగా కోట్ చేయబడిన పోలీకార్బోనేట్ యూనిబాడీని అందించారు. ఈ విధానం వలన ఫోన్ చేతిలో చక్కని గ్రిప్ తో ఇమిడి పోతుంది.

 ముందు చెప్పినట్లుగా, పోకో ఎఫ్1 స్మార్ట్ ఫోన్  6జీబీ  DDR4 ర్యామ్ + 64జీబీ UFS 2.1 స్టోరేజి , 6జీబీ DDR4 ర్యామ్ + 128జీబీ UFS 2.1 స్టోరేజి మరియు 8జీబీ DDR4 ర్యామ్ + 256జీబీ UFS 2.1 స్టోరేజిలను అందిస్తుంది. కొనుగోలుదారులు ఒక హైబ్రిడ్ స్లాట్ ద్వారా మెమరీని 256జీబీ వరకు విస్తరించడానికి ఒక ఎంపికను కలిగి ఉంటుంది. ఇంకా, ఈ ఫోన్లో 4,000 mAh బ్యాటరీ ఉంది, ఇది USB టైప్ సి పోర్ట్ ద్వారా ఛార్జ్ చేయబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్లో త్వరిత ఛార్జ్ 3.0 టెక్నాలజీ మరియు  స్పీడ్ ఛార్జర్ బాక్స్ తో పాటు వస్తుంది. షియోమీ తెలిపిన ప్రకారం 8 గంటల వరకు గేమింగ్ ని ఈ స్మార్ట్ ఫోన్ ఇవ్వగలదు.

ఆప్టిక్స్ విషయానికి వస్తే,ఈ పోకో ఎఫ్1 వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది: ప్రాధమిక కెమెరా 12ఎంపీ సోనీ IMX 363 లెన్స్ f / 1.8 ఎపర్చర్, డ్యూయల్ పిక్సెల్ PDAF టెక్నాలజీ, రియల్ టైం AI ఫోటోగ్రఫి 25 రకాల సీన్ రికగ్నైజేషన్, AI బ్యాక్లైట్ డిటెక్షన్, పోర్ట్రైట్ మోడ్ మరియు HDR లో 209 సీన్స్ వరకు గుర్తించే విధంగా ఉంటుంది. ద్వితీయ కెమెరా 5ఎంపీ సెన్సార్ ని కలిగి ఉంది.  షియోమీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) లక్షణాన్ని దాటవేయడానికి ఎంచుకున్నారు. ముందు, పిక్సెల్ బినింగ్ టెక్నాలజీ, పోర్త్రైట్ మోడ్ మరియు HDR తో 20ఎంపీ లెన్స్ ఉంది. పరిసర ప్రభావం కోసం రెండు స్పీకర్లు ఉన్నాయి. ఒక క్రింద ఉంటుంది, మరొకటి ఇయర్పీస్ లో ఉంటుంది. ఈ రెండు స్పీకర్లు డిరెక్ హెచ్ డి సౌండ్ గల ఒక డ్యూయల్ స్మార్ట్ పవర్ యాంప్లిఫైయర్ ని కలిగివున్నాయి.

పోకో కోసంవున్న MIUI

పోకో ఎఫ్1  ఆండ్రాయిడ్ 8.1 Oreo తో కొత్త "MIUI POCO" స్కిన్ తో నడుస్తుంది.  డిస్ప్లే యొక్క దిగువ ఉన్న సెర్చ్ బార్ మినహా, యాప్ డ్రాయర్ స్టాక్ ఆండ్రాయిడ్ కి చాలా పోలి ఉంటుంది.  వినియోగదారుడు అనువర్తనాలను దాచడానికి  ఎడమ నుండి కుడికి రెండు సార్లు స్వైపింగ్ ద్వారా వాటిని లాక్ చెయ్యడానికి అనుమతించే కొత్త హిడెన్ యాప్స్ ఫీచర్ కూడా ఉంది. పోకో లాంచర్ బీటా ఆగస్టు 29 నుంచి ప్లే స్టోర్లో లభిస్తుంది. "పోకో కోసం MIUI" 28 శాతం వేగంగా అప్లికేషన్ బూట్ మరియు 22 శాతం వేగవంతమైన యానిమేషన్లు ఇతర ప్రముఖ OS ల కంటే భిన్నంగా తీసుకువస్తుందని షియోమీ పేర్కొంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo