Oppo Reno 15 Pro Mini: చేతిలో ఇమిడిపోయే కాంపాక్ట్ ఫోన్ కూడా లాంచ్ చేస్తున్న ఒప్పో.!

HIGHLIGHTS

ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజింగ్ నుంచి కొత్త అప్డేట్ అందించింది

చేతిలో ఇమిడిపోయే కాంపాక్ట్ ఫోన్ కూడా లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో తెలిపింది

ఒప్పో పాడ్ 5 కూడా అదే రోజు లాంచ్ అవుతుంది

Oppo Reno 15 Pro Mini: చేతిలో ఇమిడిపోయే కాంపాక్ట్ ఫోన్ కూడా లాంచ్ చేస్తున్న ఒప్పో.!

Oppo Reno 15 Pro Mini: ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ టీజింగ్ నుంచి కొత్త అప్‌డేట్ అందించింది. ఈ సిరీస్ లో పెద్ద సైజు ఫోన్స్ తో పాటు చేతిలో ఇమిడిపోయే కాంపాక్ట్ ఫోన్ కూడా లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో తెలిపింది. అయితే, ఈ సిరీస్ నుంచి అందించే ఫోన్స్ లిస్ట్ ఇంకా తెలియ రాలేదు. కానీ, ఈ ఫోన్ టీజర్ నుంచి ఈ సిరీస్ లో కొత్త మినీ వేరియంట్ ఉన్నట్లు కూడా ప్రకటించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Oppo Reno 15 Pro Mini: లాంచ్

ఒప్పో అప్ కమింగ్ సిరీస్ ఇండియా లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ సిరీస్ కలిగిన ఫీచర్స్ వెల్లడిస్తూ టీజింగ్ మాత్రం చేస్తోంది. ఈ సీరీస్ నుంచి ఒప్పో రెనో 15 5జి, ఒప్పో రెనో 15 ప్రో 5జి మరియు ఒప్పో రెనో 15 మినీ 5జి మూడు ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు, ఒప్పో పాడ్ 5 కూడా ఇదే రోజు లాంచ్ అవుతుంది.

Oppo Reno 15 Pro Mini: ఫీచర్స్

ఒప్పో రెనో డిజైన్ వివరాలు వెల్లడిస్తూ ‘ఇది చాలా కాంపాక్ట్ సైజులో ఉంటుంది మరియు మీ చేతిలో ఇమిడేలా డిజైన్ చేయబడింది’ అని ఒప్పో క్యాషన్ అందించింది. ఈ ఫోన్ ఒప్పో రెనో 15 ప్రో వేరియంట్ కలిగిన అన్ని ఫీచర్స్ మరియు డిజైన్ తో ఉంటుంది. కానీ, ఈ ఈ ఫోన్ సైజు మాత్రమే చిన్నగా ఉంటుందని చెబుతున్నారు. అంటే, ఒప్పో రెనో 15 ప్రో ఫీచర్స్ ఈ మినీ వేరియంట్ ఫీచర్స్ ఒకే విధంగా ఉంటాయి.

Oppo Reno 15 Pro Mini

ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్లో మొదటి హోలో ఫ్యూజన్ టెక్నాలజీ ఫోన్ గా వస్తుంది. ఇది ఫోన్ వెనుక బ్యాక్ ప్యానల్ ను రిచ్ గా చూపిస్తుంది మరియు డైనమిక్ స్టెల్లార్ రింగ్ డిజైన్ తో మరింత అందంగా ఉండేలా చేసింది. ఈ ఫోన్ చాలా స్లీక్ గా ఉంటుంది మరియు అంతే కాంపాక్ట్ గా ఉంటుంది. ఇది సింగల్ హ్యాండ్ కు కూడా అనువైన డిజైన్ తో ఉంటుంది.

Also Read: Pan Aadhaar Link status చెక్ చేయడం మరియు లింక్ చేయడం మర్చిపోకండి.. జస్ట్ 4 రోజులే ఛాన్స్!

ఒప్పో రెనో 15 ప్రో మినీ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ గురించి ఒప్పో తెలిపిన ప్రకారం, ఈ ఫోన్ కెమెరా బంప్ మరియు బ్యాక్ ప్యానల్ మొత్తం కూడా సింగిల్ గ్లాస్ తో చెక్కినట్లు తెలుస్తోంది. ఇది గ్లేషియర్ గ్లో గ్లాస్ వేరియంట్ తో లాంచ్ అవుతుందని కూడా తెలుస్తోంది. ఈ ఫోన్ సిరీస్ లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు కూడా ఒప్పో త్వరలోనే అందిస్తుందని చెబుతోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo