Oppo K13 Turbo Series ను మొబైల్ రంగం ఎన్నడూ చూడని ఇన్ బిల్ట్ ఫ్యాన్ తో లాంచ్ చేస్తోంది.!
Oppo K13 Turbo Series కొత్త అప్డేట్ ఈరోజు విడుదల చేసింది
మొబైల్ రంగం ఎన్నడూ చూడని ఇన్ బిల్ట్ ఫ్యాన్ తో లాంచ్ అవుతాయని ఒప్పో సగర్వంగా కొత్త అనౌన్స్ చేసింది
కొత్త అప్డేట్ మరియు నెట్టింట్లో ఈ ఫోన్స్ అంచనా ఫీచర్ల గురించి జరుగుతున్న చర్చ
Oppo K13 Turbo Series స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ కొత్త అప్డేట్ ఈరోజు విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి లాంచ్ చేసే ఫోన్లు మొబైల్ రంగం ఎన్నడూ చూడని ఇన్ బిల్ట్ ఫ్యాన్ తో లాంచ్ అవుతాయని ఒప్పో సగర్వంగా కొత్త అనౌన్స్ రిలీజ్ చేసింది. ఈ అప్ కమింగ్ ఒప్పో స్మార్ట్ ఫోన్ సిరీస్ ఫోన్లు గురించి మీరు కంపెనీ అందించిన కొత్త అప్డేట్ మరియు నెట్టింట్లో ఈ ఫోన్స్ అంచనా ఫీచర్ల గురించి జరుగుతున్న చర్చ ఏమిటో తెలుసుకోండి.
SurveyOppo K13 Turbo Series : లాంచ్ డేట్
ఒప్పో కె 13 టర్బో సిరీస్ లాంచ్ డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అయితే, త్వరలోనే ఒప్పో ఈ ఫోన్ లాంచ్ డేట్ అందిస్తుందని ఆశిస్తున్నారు. అయితే, ఒప్పో అఫీషియల్ X (గతంలో ట్విట్టర్) అకౌంట్ నుంచి అందించిన లేటెస్ట్ అప్డేట్ ద్వారా ఈ ఫోన్ కీలక ఫీచర్ మాత్రం వెల్లడించింది. ఈ ఫీచర్ ద్వారా ఈ ఫోన్ ఎలా ఉంటుందో అంచనా వేయడం సులభమయ్యింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ ఫోన్ లాంచ్ కోసం మైక్రో సైట్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది.
Oppo K13 Turbo Series : కొత్త అప్డేట్ ఏమిటి?
ఈరోజు ఒప్పో విడుదల చేసిన కొత్త అప్డేట్ ద్వారా ఈ ఫోన్ మొబైల్ రంగం ఎన్నడూ చూడని ఇన్ బిల్ట్ ఫ్యాన్ తో లాంచ్ అవుతుందని కన్ఫర్మ్ అయ్యింది. అంటే, ఈ ఫాలెన్ ల్యాప్ టాప్ మాదిరిగా కూలింగ్ కోసం ప్రత్యేకమైన మైక్రో ఫ్యాన్ ను ఫోన్ లోపల కలిగి ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక కొత్త ఫీచర్ తో ఫోన్ లను విడుదల చేసే ఒప్పో ఇప్పుడు కూడా ఈ కొత్త ఫీచర్ ను మొబైల్ రంగానికి పరిచయం చేసింది.

ఈ అప్డేట్ తో ఈ అంచనా ఫీచర్స్ కి లింక్ ఏమిటి?
ఈ అప్డేట్ తో ఈ అంచనా ఫీచర్స్ కి లింక్ ఏమిటి, అనుకుంటున్నారా? ఒక చిన్న లింక్ ఉంది. వాస్తవానికి, ఒప్పో కె 13 టర్బో సిరీస్ ను గత వారం చైనాలో లాంచ్ చేసింది మరియు ఈ ఫోన్స్ ఇన్ బిల్ట్ ఫ్యాన్ తో లాంచ్ చేసింది. అంటే, చైనాలో విడుదల చేసిన అదే సిరీస్ ను ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉందని వేస్తున్న అంచనాలకు ఈ కొత్త అప్డేట్ ఊతం అందించింది.
ఒప్పో కె 13 టర్బో సిరీస్ : అంచనా ఫీచర్లు (చైనా)
ఒప్పో చైనాలో విడుదల చేసిన అదే వేరియంట్ ను ఇండియాలో విడుదల చేసే అవకాశం ఉండవచ్చని ఈ అంచనా ఫీచర్లు అందిస్తున్నాము. అయితే, కంపెనీ నుంచి ఈ ఫోన్ ఫీచర్ల గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదని గమనించాలి. ఇక అంచనా ఫీచర్స్ లోకి వెళితే, ఈ సిరీస్ ఫోన్లు కొత్త ఇన్ బిల్ట్ మైక్రో ఫ్యాన్ సపోర్ట్ కలిగి ఉంటాయి. కెమెరా బంప్ లో ఈ కూలింగ్ ఫ్యాన్ ను ఒప్పో అందించింది. ఇది ఫోన్ ను వేగంగా చల్లబరచడం లో కీలక పాత్ర పోషిస్తుందని ఒప్పో తెలిపింది.
డిజైన్ పరంగా, ఈ ఫోన్ సరికొత్త రేసింగ్ ఫంక్షన్ డిజైన్ తో అందిస్తుంది. ఇది భారీ 7000 mAh బిగ్ బ్యాటరీ మరియు 67W సూపర్ ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సిరీస్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇందులో 50MP మెయిన్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది.
Also Read: Vivo V60 స్మార్ట్ ఫోన్ ZEISS 50MP సూపర్ టెలిఫోటో కెమెరాతో లాంచ్ అవుతుంది.!
ఒప్పో ఈ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలక ఫీచర్లు త్వరలోనే వెల్లడిస్తుంది కాబట్టి, త్వరలోనే ఈ ఫోన్ కీలక వివరాలు తెలిసే అవకాశం వుంది.
గమనిక: పైన అందించిన మెయిన్ ఇమేజ్ చైనాలో విడుదల చేసిన ఒప్పో కె13 టర్బో ప్రో వేరియంట్ ఫోటో. ఇండియా వేరియంట్ ఇమేజ్ ఇంకా రిలీజ్ అవ్వలేదని గమనించాలి.