Oppo K13 Turbo Series: అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ రిలీజ్ అనౌన్స్ చేసిన ఒప్పో.!
ఒప్పో బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ సిరీస్ గా చెప్పబడే K సిరీస్ నుంచి అప్ కమింగ్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది
Oppo K13 Turbo Series ఫోన్స్ లాంచ్ గురించి ఈరోజు అనౌన్స్ చేసింది
ఈ ఫోన్స్ లాంచ్ కోసం ఒప్పో టీజింగ్ కూడా మొదలు పెట్టింది
Oppo K13 Turbo Series : ఒప్పో బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ సిరీస్ గా చెప్పబడే K సిరీస్ నుంచి అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అనౌన్స్ చేసింది, ఈ ఒప్పో కొత్తగా కె13 టర్బో సిరీస్ ఫోన్స్ లాంచ్ గురించి ఈరోజు అనౌన్స్ చేసింది. ఈ ఫోన్స్ లాంచ్ కోసం ఒప్పో టీజింగ్ కూడా మొదలు పెట్టింది. రీసెంట్ గా ఒప్పో కె సిరీస్ నుంచి కె 13 మరియు కె13x ఫోన్స్ అందించిన ఒప్పో ఇప్పుడు ఈ కొత్త కె టర్బో సిరీస్ కూడా రిలీజ్ చేస్తోంది.
SurveyOppo K13 Turbo Series
ఒప్పో కె 13 టర్బో సిరీస్ లాంచ్ కోసం ఒప్పో ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు. ఈ ఫోన్ ను త్వరలోనే లాంచ్ చేస్తుందని మాత్రం ప్రకటించింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యేకమైన టీజర్ పేజీ నుంచి అందించి టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది.

వాస్తవానికి, ఒప్పో కె టర్బో సిరీస్ ను ముందుగా చైనా లో లాంచ్ చేసింది. ఈ సిరీస్ ఫోన్లు ఇప్పటికే చైనా మార్కెట్ లో సేల్ కూడా అవుతున్నాయి. అయితే, ఇదే ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతుందా లేక మార్పులు ఏమైనా చేస్తుందో చూడాలి.
Oppo K13 Turbo Series : ఫీచర్లు (చైనా)
ఒప్పో కె సిరీస్ నుంచి రెండు ఫోన్లు విడుదల చేసింది. ఇందులో కె టర్బో మరియు కె టర్బో ప్రో రెండు ఫోన్లు ఉన్నాయి. ఒప్పో ఈ ఫోన్లను మొబైల్ ‘రంగంలో పెను మార్పు తెచ్చే కొత్త ఫీచర్ తో అందించింది. అదేమిటంటే, ఈ ఫోన్లలో ల్యాప్ టాప్స్ మాదిరిగా కూలింగ్ ఫ్యాన్ అందించింది. ఈ ఫోన్ వేడెక్కగానే ఈ ఫోన్ లో అందించిన ఫ్యాన్ ఈ ఫోన్ ను చల్లబరుస్తుంది. ఈ సెటప్ ను కూలింగ్ ఇంజిన్ గా ఒప్పో సంబోధించింది.
ఈ ఒప్పో ఫోన్ సిరీస్ భారీ 7000 mAh బ్యాటరీ మరియు 80W సూపర్ ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఒప్పో ఫోన్స్ గేమింగ్ కోసం అనువైన భారీ డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు డి 120FPS గేమింగ్ సపోర్ట్ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా ఒప్పో ఫోన్ లలో ఎన్నడూ చూడని రేసింగ్ ఫంక్షన్ డిజైన్ కలిగి ఉంటాయి. ఇవి కాకూండా ఈ ఫోన్ లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు టైడల్ ఇంజిన్ మరియు మీడియాటెక్ లేటెస్ట్ 4nm చిప్ సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Also Read: Vivo V60 ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన వివో.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
అయితే, ఇండియన్ మార్కెట్లో ఎటువంటి ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ చేస్తుంది, అనే ఉత్కంఠ ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఇప్పటివరకు మొబైల్ యూజర్లు చూడని కొత్త కూలింగ్ ఫ్యాన్ ఫీచర్ ఇన్ ఈ ఫోన్ గురించి ఎక్కువగా ఆలోచింప చేసేలా ఉంటుంది. ఇవన్నీ తెలియాలంటే ఈ ఫోన్ గురించి కంపెనీ అప్డేట్స్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.