OPPO Find X9 Ultra: ఒప్పో అల్ట్రా ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా ని ఈరోజు లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఫోన్ చరిత్రలో చూడని అద్భుతమైన కెమెరాతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ DSLR ని మరిపించే అద్భుతమైన ఫ్యూట్లు మరియు 8K వీడియోలు అందిస్తుందని ఒప్పో తెలిపింది. ఒప్పో సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఫీచర్స్ మరియు ఆఫర్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో ప్రీమియం ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను రూ. 1,69,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేసింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఇండియా మరియు కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ప్రీ ఆర్డర్ చేయవచ్చు. ఈ ఫోన్ కాన్యాన్ ఆరెంజ్ మరియు తండ్రా అంబర్ రెండు రంగుల్లో లభిస్తుంది.
ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్ కూడా ఒప్పో అందించింది. ఈ ఫోన్ పై ఫ్లాట్ 10% భరిం బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంటే, ఈ ఫోన్ ను ICICI, HDFC మరియు SBI కార్డ్స్ తో ప్రీ బుక్ లేదా కొనుగోలు చేసే వారికి రూ. 16,999 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు ఈ ఫోన్ పై రూ. 5,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది.
Also Read: Realme Buds Air 8 Pro మాస్టర్ డిజైన్ మరియు డ్యూయల్ DAC స్పీకర్స్ తో వస్తుంది.!
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ 6.82 ఇంచ్ Pro XDR AMOLED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ QHD+ (3168×1440) పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ రక్షణ కూడా కలిగి ఉంటుంది. ఒప్పో ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 12GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది.
ఈ ఫోన్ కెమెరా పరంగా అద్భుతమైన సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 200MP అల్ట్రా సెన్సింగ్ (Sony LYT-901) మెయిన్ కెమెరా, 200MP Hasselblad (3x) అల్ట్రా సెన్సింగ్ టెలిఫోటో, 10x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ 50MP టెలిఫోటో మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగిన క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30fps తో 8K వీడియో, 120fps / 60fps తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇందులో HDR మరియు డాల్బీ విజన్ వీడియో సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది.
ఈ ఫోన్ 7050 mAh పెద్ద బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో మంచి లాంగ్ టైం బ్యాటరీ బ్యాక్ అప్ అందిచే`అందించడమే కాకుండా చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ తో వస్తుంది.