OPPO Find X9 Ultra: మొబైల్ ఫోన్ చరిత్రలో చూడని అద్భుతమైన కెమెరాతో లాంచ్ అయ్యింది.!

OPPO Find X9 Ultra: మొబైల్ ఫోన్ చరిత్రలో చూడని అద్భుతమైన కెమెరాతో లాంచ్ అయ్యింది.!

OPPO Find X9 Ultra: ఒప్పో అల్ట్రా ప్రీమియం స్మార్ట్ ఫోన్ ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా ని ఈరోజు లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ మొబైల్ ఫోన్ చరిత్రలో చూడని అద్భుతమైన కెమెరాతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ DSLR ని మరిపించే అద్భుతమైన ఫ్యూట్లు మరియు 8K వీడియోలు అందిస్తుందని ఒప్పో తెలిపింది. ఒప్పో సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్, ఫీచర్స్ మరియు ఆఫర్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OPPO Find X9 Ultra: ప్రైస్

ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో ప్రీమియం ప్రైస్ సెగ్మెంట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను రూ. 1,69,999 రూపాయల ప్రైస్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రీ ఆర్డర్ కూడా ఈరోజు నుంచి స్టార్ట్ చేసింది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్, అమెజాన్ ఇండియా మరియు కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ప్రీ ఆర్డర్ చేయవచ్చు. ఈ ఫోన్ కాన్యాన్ ఆరెంజ్ మరియు తండ్రా అంబర్ రెండు రంగుల్లో లభిస్తుంది.

ఆఫర్స్

ఈ స్మార్ట్ ఫోన్ పై భారీ లాంచ్ ఆఫర్స్ కూడా ఒప్పో అందించింది. ఈ ఫోన్ పై ఫ్లాట్ 10% భరిం బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అంటే, ఈ ఫోన్ ను ICICI, HDFC మరియు SBI కార్డ్స్ తో ప్రీ బుక్ లేదా కొనుగోలు చేసే వారికి రూ. 16,999 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో పాటు ఈ ఫోన్ పై రూ. 5,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందించింది.

Also Read: Realme Buds Air 8 Pro మాస్టర్ డిజైన్ మరియు డ్యూయల్ DAC స్పీకర్స్ తో వస్తుంది.!

OPPO Find X9 Ultra: ఫీచర్స్

ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 అల్ట్రా స్మార్ట్ ఫోన్ స్మార్ట్ ఫోన్ 6.82 ఇంచ్ Pro XDR AMOLED డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ QHD+ (3168×1440) పిక్సెల్స్ రిజల్యూషన్, 144Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ రక్షణ కూడా కలిగి ఉంటుంది. ఒప్పో ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 12GB ర్యామ్ మరియు 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా అందించింది.

ఈ ఫోన్ కెమెరా పరంగా అద్భుతమైన సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 200MP అల్ట్రా సెన్సింగ్ (Sony LYT-901) మెయిన్ కెమెరా, 200MP Hasselblad (3x) అల్ట్రా సెన్సింగ్ టెలిఫోటో, 10x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ 50MP టెలిఫోటో మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగిన క్వాడ్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 50MP సెల్ఫీ కెమెరా కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 30fps తో 8K వీడియో, 120fps / 60fps తో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇందులో HDR మరియు డాల్బీ విజన్ వీడియో సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ ప్రొఫెషనల్ గ్రేడ్ ఫోటోలు మరియు వీడియోలు అందిస్తుంది.

ఈ ఫోన్ 7050 mAh పెద్ద బ్యాటరీతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫీచర్స్ తో మంచి లాంగ్ టైం బ్యాటరీ బ్యాక్‌‌ అప్ అందిచే`అందించడమే కాకుండా చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ IP66, IP68 మరియు IP69 రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile