Realme Buds Air 8 Pro మాస్టర్ డిజైన్ మరియు డ్యూయల్ DAC స్పీకర్స్ తో వస్తుంది.!
Realme Buds Air 8 Pro ఇయర్ బడ్స్ లాంచ్ కోసం రియల్ మీ డేట్ అనౌన్స్ చేసింది
ఈ అప్ ఇయర్ బడ్స్ మాస్టర్ డిజైన్ మరియు డ్యూయల్ DAC స్పీకర్స్ తో లాంచ్ అవుతుంది
ఈ ఇయర్ బడ్స్ గురించి కంపెనీ చాలా గొప్పగా టీజింగ్ చేస్తోంది
Realme Buds Air 8 Pro ఇయర్ బడ్స్ లాంచ్ కోసం రియల్ మీ డేట్ అనౌన్స్ చేసింది. ఈ అప్ ఇయర్ బడ్స్ మాస్టర్ డిజైన్ మరియు డ్యూయల్ DAC స్పీకర్స్ తో లాంచ్ అవుతుంది. ఈ ఇయర్ బడ్స్ గురించి కంపెనీ చాలా గొప్పగా టీజింగ్ చేస్తోంది. ఇది ప్రీమియం ప్రీమియం ఫీచర్స్ మరియు ప్రీమియం డిజైన్ తో లాంచ్ అవుతుందని రియల్ మీ తెలిపింది.
SurveyRealme Buds Air 8 Pro: లాంచ్ డేట్
రియల్ మీ ఈ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ ను మే 22వ తేదీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేస్తున్నట్లు డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఇయర్ బడ్స్ కోసం అమెజాన్ ద్వారా ప్రత్యేకంగా అందించిన మైక్రో సైట్ టీజర్ పేజీ ద్వారా డేట్ తో పాటు కీలక ఫీచర్లు కూడా రియల్ మీ రివీల్ చేసింది.
Realme Buds Air 8 Pro : కీలక ఫీచర్స్
ఈ ఇయర్ బడ్స్ ను చాలా ప్రీమియం డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ తెలిపింది. ఇది ప్రీమియం ఫినిష్ మిర్రర్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఇయర్ బడ్స్ ప్రీమియర్ డ్యూయల్ DAC డ్రైవర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 11mm ఉఫర్స్ జతగా 6mm ట్వీటర్లు ఉంటాయి. ఇది Hi-Res Audio సర్టిఫికేషన్ మరియు LHDC ఫీచర్ కూడా కలిగి ఉంటుంది. అంటే, ఇది ప్రీమియం సౌండ్ అందించే అన్ని ఫీచర్స్ ని కలిగి ఉన్నట్లు క్లియర్ గా తెలిపింది.

రియల్ మీ నూడ్స్ ఎయిర్ 8 ప్రో ఇయర్ బడ్స్ 55dB అల్ట్రా డెప్త్ నోయిస్ క్యాన్సిలేషన్ కలిగి ఉంటుంది. ఇది 6 మైక్ సిస్టం మరియు AI నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో కూడా వస్తుంది. అంటే, ఈ బడ్స్ గొప్ప నోయిస్ క్యాన్సిలేషన్ తో లీనమయ్యే సౌండ్ మరియు గొప్ప కాలింగ్ కూడా అందించే ఫీచర్స్ కలిగి ఉంటుంది.
Also Read: ఆధార్ డీ యాక్టివేట్ ఎందుకు అవుతుంది .. Aadhaar Activate ఎలా చేయాలో తెలుసుకోండి.!
ఇక ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ రియల్ మీ అప్ కమింగ్ ఇయర్ బడ్స్ 50 గంటల లాంగ్ ప్లే బ్యాక్ అందిస్తుంది. ఇది 3 డివైజ్ కనెక్షన్, AI ట్రాన్స్లేటర్ మరియు 3D స్పేషియల్ ఆడియో మరియు 45 ms లో లెటెన్సీ ఫీచర్ ను కూడా కలిగి ఉంటుంది. ఇది IP 55 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ బడ్స్ ను ప్రీమియం ఫీచర్స్ మరియు డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు రియల్ మీ తెలిపింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile