OPPO Find X9 Series ఇండియా లాంచ్ డేట్ మరియు టాప్ ఫీచర్స్ రివీల్ చేసిన ఒప్పో.!
OPPO Find X9 Series లాంచ్ కోసం గత కొన్ని రోజులుగా టీజింగ్
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ కూడా రివీల్ చేసింది
ఈ ఫోన్ ను భారీ కెమెరా సెటప్ మరియు మీడియాటెక్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది
OPPO Find X9 Series లాంచ్ కోసం గత కొన్ని రోజులుగా టీజింగ్ చేస్తున్న ఒప్పో, ఈరోజు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు కీలకమైన ఫీచర్స్ కూడా రివీల్ చేసింది. ఈ ఫోన్ ను భారీ కెమెరా సెటప్ మరియు మీడియాటెక్ పవర్ ఫుల్ చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ అయ్యే ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్.
SurveyOPPO Find X9 Series : లాంచ్ డేట్?
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను నవంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో అనౌన్స్ చేసింది. ఈ సిరీస్ నుంచి ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 మరియు ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 ప్రో రెండు ఫోన్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వీటిలో ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది మరియు ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా ఉంటుంది.
OPPO Find X9 Series : ఫీచర్స్
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 సిరీస్ ఫోన్లు సరికొత్త డిజైన్ తో లాంచ్ అవుతున్నాయి. ఈ ఫోన్స్ మీడియాటెక్ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ చిప్ సెట్ Dimensity 9500 కలిగి ఉంటాయి. ఇది 3nm ప్రోసెసర్ మరియు ఇది దీని ముందుతరం చిప్ సెట్ కంటే మరింత వేగంగా ఉంటుంది. ఈ ఫోన్స్ లో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే డాల్బీ విజన్, HDR 10+ మరియు 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో ఉన్న స్క్రీన్ కేవలం 1.15mm అల్ట్రా థిన్ బెజెల్ తో ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ ఆఫర్ చేస్తుంది.

ఈ సిరీస్ హై ఎండ్ ఫోన్ ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 ప్రో యొక్క కెమెరా వివరాలు వెల్లడించింది. ఈ ఫోన్ లో 50MP ప్రో లెవల్ మెయిన్ కెమెరా, 200MP HASSELBLAD కెమెరా, 50MP అల్ట్రా వైడ్ మరియు ట్రూ కలర్ కెమెరా కలగలసిన క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది 120x AI టెలిస్కోపిక్ జూమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120FPS వద్ద 4K డాల్బీ విజన్ వీడియో మరియు 4K స్లో మోషన్ వంటి గొప్ప వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.
Also Read: Devialet Mania opera రఫ్ పోర్టబుల్ Hi-Fi స్పీకర్ లాంచ్ అయ్యింది.. ధర తెలిస్తే షాక్ అవుతారు.!
ఈ ఫోన్ లో భారీ 7000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ వేగంగా ఛార్జ్ చేసే 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు 50W ఎయిర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ సిరీస్ ఫోన్లను లేటెస్ట్ కలర్ OS 16 తో లాంచ్ చేస్తునట్లు తెలిపింది.