Oppo Find X9 Series కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.!
Oppo Find X9 Series స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ ను ఒప్పో అనౌన్స్ చేసింది
ఈ ఫోన్ ను 200MP టెలిఫోటో కెమెరా మరియు సరికొత్త డిజైన్ తో గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది
ఇండియాలో కూడా ఇదే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది
Oppo Find X9 Series స్మార్ట్ ఫోన్ ఇండియా లాంచ్ ను ఒప్పో అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ముందుగా గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసిన ఒప్పో, ఇప్పుడు ఈ ఫోన్ ను ఇండియాలో కూడా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్ ను 200MP టెలిఫోటో కెమెరా మరియు సరికొత్త డిజైన్ తో గ్లోబల్ మార్కెట్ లో లాంచ్ చేసింది. ఇండియాలో కూడా ఇదే ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ ఫీచర్స్ తెలుసుకోండి.
SurveyOppo Find X9 Series : ఇండియా లాంచ్ డేట్?
ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 సిరీస్ ఇండియా లంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ నవంబర్ నెలలో లాంచ్ అవుతుందని చెబుతున్నారు. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన ఆన్లైన్ సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. అందుకే, ఈ ఫోన్ లాంచ్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజీతో టీజింగ్ చేస్తోంది.
Oppo Find X9 Series : ఫీచర్స్
ఒప్పో ఫైండ్ ఎక్స్9 సిరీస్ ను సరికొత్త డిజైన్ లో అందిస్తుంది. ఈ ఫోన్ లో వెనుక పెద్ద కెమెరా బంప్ తో ఆకట్టుకునే డిజైన్ లో అందించింది. ఈ ఫోన్ ప్రీమియం లుక్ తో ఉండడమే కాకుండా గొప్ప ఫీల్ కూడా అందిస్తుంది. ఈ ఒప్పో ఫోన్ AI ఫ్లాగ్ షిప్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 200MP టెలిఫోటో కెమెరా జతగా 50MP వైడ్ యాంగిల్ మరియు 50MP అల్ట్రా వైడ్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది . అంతేకాదు, ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన కంప్లీట్ కెమెరా సెటప్ తో గొప్ప ఫోటోలు మరియు జబర్దస్త్ వీడియో రికార్డింగ్ అందిస్తుంది.

ఈ ఫోన్ ఏకంగా 120 FPS 4K Dolby Vision వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ 4K స్లో మోషన్ మరియు 4K టైమ్ లాప్స్ వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను HASSELBLAD సహకారంతో అందించింది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 9500 చిప్ సెట్ తో వస్తుంది. ఇది 4.21GHz క్లాక్ స్పీడ్ కలిగిన ప్రీమియం చిప్ సెట్ మరియు ఇది LPDDR5X ర్యామ్ తో ఉంటుంది.
ఈ ఒప్పో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ ను 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.ఈ ఫోన్ 7500 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది మరియు ఇది 80W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ తో పాటు 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
పైన తెలిపిన వివరాలు ఒప్పో గ్లోబల్ వేరియంట్ కలిగిన ఫీచర్స్ మరియు ఇది ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 ప్రో వేరియంట్ ఫీచర్స్. ఇండియాలో కూడా ఇదే ఫీచర్స్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.