OPPO F31 Series 5G ఇండియా లాంచ్ అనౌన్స్ చేసిన ఒప్పో.!
Oppo F31 Series 5G ఇండియా లాంచ్ ఒప్పో అనౌన్స్ చేసింది
స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ తో ఒప్పో టీజింగ్ మొదలు పెట్టింది
ఒప్పో యొక్క అధికారిక X అకౌంట్ నుంచి ఈ ఫోన్స్ లాంచ్ వివరాలు అందించింది
Oppo F31 Series 5G ఇండియా లాంచ్ ఒప్పో అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సిరీస్ నుంచి లాంచ్ చేయనున్న స్మార్ట్ ఫోన్ టీజర్ ఇమేజ్ తో ఒప్పో టీజింగ్ మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ సిరీస్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ డేట్ మరియు ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
SurveyOPPO F31 Series 5G లాంచ్ డేట్ ఏమిటి?
ఒప్పో ఎఫ్ 31 సిరీస్ 5జి స్మార్ట్ ఫోన్ లను సెప్టెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ఒప్పో అనౌన్స్ చేసింది. ఒప్పో యొక్క అధికారిక X అకౌంట్ నుంచి ఈ ఫోన్స్ లాంచ్ వివరాలు అందించింది. అంతేకాదు, ఈ అప్ కమింగ్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు యొక్క టీజర్ ఇమేజ్ లను కూడా ఈ పోస్ట్ నుంచి విడుదల చేసింది. ఈ సిరీస్ ఫోన్ లను ‘స్మూత్ అండ్ పవర్ ఫుల్’ అనే క్యాప్షన్ తో టీజింగ్ చేస్తోంది.
OPPO F31 Series 5G ఫీచర్స్ ఏమిటి?
ఒప్పో ఎఫ్ 31 సిరీస్ 5జి నుండి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదల చేస్తున్నట్లు టీజింగ్ చేస్తోంది. ఒప్పో అందించిన టీజర్ ఇమేజ్ లో ఈ రెండు ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు కూడా వేరు వేరు డిజైన్ మరియు కెమెరా సెటప్ తో కనిపిస్తున్నాయి. ఇందులో ఒప్పో ఎఫ్ 31 మరియు ఒప్పో ఎఫ్ 31 ప్రో వేరియంట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే, ఈ సిరీస్ నుంచి మూడు స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఒప్పో అందించిన టీజర్ ఇమేజ్ ద్వారా ఈ అప్ కమింగ్ ఫోన్స్ స్లీక్ డిజైన్ తో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇందులో ఒక ఫోన్ రౌండ్ బంప్ కలిగిన కెమెరా సెటప్ మరియు రెండోది రౌండ్ కార్నర్ స్క్వేర్ కెమెరా సెటప్ కలిగి ఉన్నట్లు కన్ఫర్మ్ చేసింది. ఈ రెండు ఫోన్లు కూడా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉన్నాయి. ఈ ఫోన్లు ఈ బడ్జెట్ ప్రైస్ లో ఇంతకు ముందు చూడని గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తాయని ఒప్పో టీజింగ్ చేస్తోంది.
Also Read: GST 2.0 Effect: భారీగా తగ్గనున్న Smart Tv ధరలు.. కొత్త టీవీ కొనే వారికి పండగే.!
ఒప్పో ఎఫ్ 31 సిరీస్ 5జి : అంచనా ఫీచర్స్
ఒప్పో ఎఫ్ 31 సిరీస్ 5జి స్మార్ట్ ఫోన్ అంచనా ఫీచర్లు ఇప్పుడు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్లు భారీ 7000 mAh బ్యాటరీ తో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్లు 120Hz రిఫ్రెష్ రేట్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు మంచి బ్రైట్నెస్ కలిగిన AMOLED స్క్రీన్ రావచ్చని కూడా ఊహిస్తున్నారు. వీటిలో 50MP AI డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ మరియు 80W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో పాటు IP66, IP68 మరియు IP69 రేటింగ్ కలిగి ఉండే అవకాశం ఉండవచ్చని అంచనా వేసి చెబుతున్నారు. అయితే, ఒప్పో నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు ఖచ్చితమైన వివరాలు కోసం ఎదురు చూడాల్సిందే.