OPPO F27 Pro+ 5G: డేమేజ్ ప్రూఫ్ మరియు వాటర్ ప్రూఫ్ డిజైన్ తో వచ్చింది.!
ఈ రోజు ఒప్పో కొత్త ఫోన్ OPPO F27 Pro+ 5G ను విడుదల చేసింది
ఈ ఫోన్ ను డేమేజ్ ప్రూఫ్ మరియు వాటర్ ప్రూఫ్ డిజైన్ తో అందించింది
ఈరోజు నుండే ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది
OPPO F27 Pro+ 5G: ఈ రోజు ఒప్పో కొత్త స్మార్ట్ ఫోన్ ఒప్పో ఎఫ్ 27 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను డేమేజ్ ప్రూఫ్ మరియు వాటర్ ప్రూఫ్ డిజైన్ తో అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ లో AI కెమెరాలు మరియు ప్రీమియం డిజైన్ వంటి మరిన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ను లాంచ్ చేయడమే కాకుండా ఈరోజు నుండే ప్రీ ఆర్డర్స్ కి అందుబాటులోకి కూడా తీసుకు వచ్చింది.
SurveyOPPO F27 Pro+ 5G: ప్రైస్
ఒప్పో ఈ కొత్త ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో బేసిక్ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 27,999 రూపాయల ధరతో, రెండవ వేరియంట్ (8GB + 256GB) ను రూ. 29,999 రూపాయల ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ Pre-Orders లను ఈరోజు నుండి మొదలు పెట్టింది. అయితే, ఈ ఫోన్ జూన్ 20 తేదీ నుండి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు ఒప్పో అధికారిక వెబ్సైట్ నుండి లభిస్తుంది.
ఈ ఫోన్ లాంచ్ లో భాగంగా బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందించింది. SBI, HDFC మరియు ICICI బ్యాంక్ కార్డ్స్ తో ఈ ఫోన్ కొనే వారికి రూ. 2,999 ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది.
OPPO F27 Pro+ 5G: ఫీచర్లు
ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ AMOLED 3D Curved డిస్ప్లేతో వచ్చింది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అంతేకాదు, ఈ డిస్ప్లే అత్యంత గట్టి గ్లాస్ గా పేరొందిన గొరిల్లా గ్లాస్ విక్టస్ గ్లాస్ ప్రొటెక్షన్ తో ఉంటుంది. ఈ ఫోన్ MediaTek బడ్జెట్ ప్రోసెసర్ Dimensity 7050 చిప్ సెట్ తో పనిచేస్తుంది. దీనికి జతగా 8GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

ఈ ఫోన్ డిజైన్ పరంగా గొప్ప ఫీచర్ లతో వచ్చింది. ఈ ఫోన్ ను ఆల్ రౌండ్ ఇంపాక్ట్ రెసిస్టెంట్ డిజైన్ మరియు IP69 వాటర్ ప్రూఫ్ ఫీచర్ తో అందించింది. ఈ ఫోన్ అందమైన డస్క్ పింక్ మరియు మిడ్ నైట్ నేవి కలర్ ఆప్షన్ లలో వచ్చింది. ఈ ఫోన్ లో 5000mAh బిగ్ బ్యాటరీని 67W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంది.
Also Read: Flipkart Sale నుంచి Dolby Audio పవర్ ఫుల్ సౌండ్ బార్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్.!
ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఈ సెటప్ లో 64MP మెయిన్ కెమెరా + 2MP పోర్ట్రైట్ కెమెరా ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ లో 8MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ లో AI పోర్ట్రైట్ రీటచ్చింగ్, AI ఎరేజర్ మరియు AI స్మార్ట్ ఇమేజ్ మ్యాట్టింగ్ ఫీచర్ లు ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile