ఆన్లైన్ లీకైన OnePlus Nord CE4 5G ధర మరియు ఫీచర్స్.!

ఆన్లైన్ లీకైన OnePlus Nord CE4 5G ధర మరియు ఫీచర్స్.!
HIGHLIGHTS

OnePlus Nord CE4 5G రేపు ఇండియాలో విడుదల అవుతుంది

ఈ ఫోన్ యొక్క ధర మరియు వివరాలు ఆన్లైన్ లో వెల్లడయ్యాయి

100W SUPERVOOC సూపర్ ఫాస్ట్ ఛార్జ్ టెక్ తో ఈ ఫోన్ వస్తోంది

వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ OnePlus Nord CE4 5G రేపు ఇండియాలో విడుదల అవుతుంది. ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 6:30 కి ఈ ఫోన్లో లాంచ్ చేయడానికి వన్ ప్లస్ ఏర్పాటు చేసింది. అయితే, విడుదల కంటే ముందే ఈ ఫోన్ యొక్క ధర మరియు పూర్తి వివరాలు ఆన్లైన్ లో వెల్లడయ్యాయి.

OnePlus Nord CE4 5G: లీక్డ్ ధర

ప్రముఖ లీక్స్టర్ అభిషేక్ యాదవ్, వన్ ప్లస్ అప్ కమింగ్ ఫోన్ నార్డ్ CE4 యొక్క ఎక్స్ క్లూజివ్ ప్రైస్ ను తన ట్విట్టర్ అకౌంట్ నుండి లీక్ చేశారు. ఈ అంచనా ధర వివరాలను ఈ క్రింద చూడవచ్చు.

స్టార్టింగ్ వేరియంట్ 8GB + 128GB అంచనా ధర : రూ. 24,999

రెండవ వేరియంట్ 8GB + 256GB అంచనా ధర : రూ. 26,999

అయితే, ఇది ఈ ఫోన్ స్పెక్స్ తో అంచనా వేసి చెప్పిన ధర మాత్రమే సుమీ. ఈ ఫోన్ రేపు ఇండియాలో లాంఛ్ అవుతుంది కాబట్టి, చూడాలి ఈ అంచనా ధర మాట ఎంత వరకూ నిజమవుతుందో. అయితే, ఈ ఫోన్ యొక్క చాలా వివరాలను కంపెనీ ముందే బయట పెట్టింది.

Also Read: Super Deal: ఐకూ Z7 ప్రో 5G పైన రూ. 2,000 బిగ్ డిస్కౌంట్ ఆఫర్.!

OnePlus Nord CE4 5G: Specs

వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ ను మంచి ఫ్లాట్ డిజైన్ తో లాంఛ్ చేస్తోంది. ఇది చాలా నాజూకుగా మరియు కంఫర్ట్ గ్రిప్ డిజైన్ తో కనిపిస్తోంది. ఈ వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ AMOLED డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే FHD+ రిజల్యూషన్ మరియు అధిక బ్రైట్నెస్ వంటి మరిన్ని ఫీచర్స్ కలిగి ఉంటుంది.

oneplus nord ce 4 display
oneplus nord ce 4 display

ఈ స్మార్ట్ ఫోన్ లో Qualcomm లేటెస్ట్ మిడ్ రేంజ్ ఫాస్ట్ ప్రోసెసర్ Snapdragon 7 Gen 3 ని అందించింది. ఇది 2.63 GHz వరకూ గరిష్ట క్లాక్ స్పీడ్ ను కలిగి వుంది. ఈ ఫోన్ మంచి పెర్ఫార్మన్స్ అందించ గలదు మరియు వేగంగా ఉంటుందని వన్ ప్లస్ తెలిపింది.ఈ వన్ ప్లస్ ఫోన్ ను 8GB ఫిజికల్ LPDDR4X RAM + 8GB అధనపు ర్యామ్ ఫీచర్ తో మొత్తంగా 16GB ర్యామ్ ను ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో 256 GB (UFS 3.1) ఇంటర్నల్ స్టోరేజ్ కూడా ఉంటుంది.

OnePlus Nord CE 4 charge tech
OnePlus Nord CE 4 charge tech

ఈ ఫోన్ లో చాలా వేగవంతమైన ఛార్జింగ్ టెక్ ను అందించినట్లు కంపెనీ తెలిపింది. వన్ ప్లస్ నార్డ్ CE4 5జి స్మార్ట్ ఫోన్ ను 100W SUPERVOOC సూపర్ ఫాస్ట్ ఛార్జ్ టెక్ తో అందిస్తున్నట్లు వన్ ప్లస్ గొప్పగా చెబుతోంది.

Tags:

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo