OnePlus 15 ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన వన్ ప్లస్.!

HIGHLIGHTS

ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కూడా వన్ ప్లస్ ప్రకటించింది

స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ తో ఇండియాలో విడుదలయ్యే మొదటి ఫోన్ గా చరిత్రలో నిలిచిపోతుంది

వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ 13s స్మార్ట్ ఫోన్ మాదిరి డిజైన్ తో వస్తుంది

OnePlus 15 ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన వన్ ప్లస్.!

OnePlus 15 స్మార్ట్ ఫోన్ ఈ వారం చైనా మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ ఇండియా లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కూడా వన్ ప్లస్ ప్రకటించింది. ఈ కొత్త అప్డేట్ తర్వాత వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్ సెట్ తో ఇండియాలో విడుదలయ్యే మొదటి ఫోన్ గా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ అప్ కమింగ్ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్లు తెలుసుకుందామా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

OnePlus 15 : ఇండియా లాంచ్ డేట్?

వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ నవంబర్ 13వ తేదీ ఇండియాలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ డేట్ ని నిన్న అధికారిక x అకౌంట్ నుంచి వన్ ప్లస్ ప్రకటించింది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియా ద్వారా కూడా టీజింగ్ చేయబడుతోంది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా సేల్ పార్ట్నర్ గా ఉంటుంది కాబట్టి ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజి అందించిన టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ కోసం నుంచి ఈ ఫోన్ యొక్క కీలక ఫీచర్స్ విడుదల చేసింది.

OnePlus 15 : కీలక ఫీచర్స్

వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ 13s స్మార్ట్ ఫోన్ మాదిరి డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ రౌండ్ కార్నర్ మరియు బిగ్ కెమెరా బంప్ తో ఉంటుంది. ఈ క్వాల్కమ్ Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ చిప్ సెట్ తో ఇండియాలో విడుదలయ్యే మొదటి ఫోన్ కూడా ఇదే అవుతోంది. ఈ ఫోన్ వన్ ప్లస్ యొక్క లేటెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ Oxygen OS 16 జతగా ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టం తో వస్తుంది. ఈ ఫీచర్స్ ద్వారా ఈ ఫోన్ పూర్తిగా సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో వస్తుందని అర్థమయ్యేలా చేసింది.

OnePlus 15 india launch

ఐకే ఈ ఫోన్ ప్లస్ ఎక్స్పెక్టెడ్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఇందులో 50MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్ మరియు 50MP టెలిస్కోప్ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ లో 1.5K రిజల్యూషన్ కలిగిన 6.78 ఇంచ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 165Hz రిఫ్రెష్ రేట్ మరియు 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.

Also Read: Nothing Phone (3a) Lite సరికొత్త డిజైన్ మరియు ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

వన్ ప్లస్ 15 స్మార్ట్ ఫోన్ 7,300 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన బిగ్ బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసే 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కూడా ఉంటుంది=ని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ చైనా వేరియంట్ ను బట్టి ఈ ఫీచర్స్ ఉండే అవకాశం ఉంటుందని ఈ అంచనా వేసాము.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo