OnePlus 13s స్మార్ట్ ఫోన్ ఈ వారంలో లాంచ్ అవుతోంది. అయితే, ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ అంచనా ధర మరియు ఫీచర్లు గురించి చర్చించనున్నాము. ఈ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ ప్రీమియం సిరీస్ లో విడుదల కానున్న మిడ్ రేంజ్ ఫోన్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ఎటువంటి ఫీచర్ కలిగి ఉండవచ్చు మరియు ఈ ఫోన్ ప్రైస్ ఎలా ఉండవచ్చు అనే విషయాలు ఈరోజు చూడనున్నాము.
Survey
✅ Thank you for completing the survey!
OnePlus 13s : అంచనా స్పెక్స్
వాస్తవానికి, వన్ ప్లస్ ఇప్పటికే ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క చాలా కీలకమైన ఫీచర్స్ కంపెనీ బయట పెట్టింది. ఇందులో ఈ ఫోన్ డిజైన్, చిప్ సెట్ మరియు ఇతర ఫీచర్లు ఉన్నాయి. వన్ ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ ను కాంపాక్ట్ మరియు స్లీక్ డిజైన్ తో లాంచ్ చేస్తున్నట్లు వన్ ప్లస్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 8 Elite చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు కూడా కంపెనీ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ లో సరికొత్తగా Plus కీ ఉన్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఇది కాకుండా అడ్వాన్స్ ఫ్యూచర్ 5.5G నెట్ వర్క్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంతేకాదు, Wi-Fi ని మరింత గొప్పగా హ్యాండిల్ చేయడానికి ఇందులో కొయిటా చిప్ సెట్ ఉంటుంది. ఇవన్నీ కూడా కంపెనీ అందించిన ఫీచర్స్ వివరాలు.
ఇక ఈ ఫోన్ యొక్క అంచనా ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 6.32 ఇంచ్ పరిమాణం కలిగిన OLED డిస్ప్లే ఉండవచ్చని అంచనా. ఈ స్క్రీన్ 1.5కే రిజల్యూషన్, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP ప్రధాన సెన్సార్ మరియు టెలిఫోటో సెన్సార్ కలిగిన రియర్ కెమెరా మరియు 32MP సెల్ఫీ కెమెరా సెటప్ కలిగి ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ AI ప్రత్యేకతలు కలిగి ఉంటుంది. దీనికోసమే వన్ ప్లస్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లో ప్రత్యేకమైన AI కీ ని కూడా అందించింది.
పనే ప్లస్ 13s స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజ్ ధరలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ. 50,000 నుంచి రూ. 55,000 రూపాయల మధ్యలో ఉండవచ్చని కూడా అంచనా వేసి చెబుతున్నారు. అయితే, ఇవన్నీ కూడా అంచనా ఫీచర్స్ మరియు అంచనా ప్రైస్ గా మాత్రమే చూడాలి. ఈ ఫోన్ జూన్ 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇండియాలో లాంచ్ అవుతుంది.