Jio తన యూజర్ల కోసం బడ్జెట్ ధరలో కూడా బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు అందించింది. యూజర్ అవసరాన్ని బట్టి మరియు బడ్జెట్ ను బట్టి యూజర్ కి తగిన ప్లాన్ ను ఎంచుకోవచ్చు. అయితే, రిలయన్స్ జియో అందించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ లవ్ ఒక ప్లాన్ డైలీ డేటా తో పాటు 20GB అదనపు డేటా మరియు మరిన్ని లాభాలు కూడా అందిస్తుంది. యూజర్లకు అదనపు లాభాలు అందించే ఈ బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ గురించి ఈరోజు చర్చిద్దాం.
Survey
✅ Thank you for completing the survey!
Jio : బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్
జియో యూజర్ల కోసం ఇటీవల అందించిన 90 రోజుల బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ. 899 రూపాయల రీఛార్జ్ ప్లాన్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ బడ్జెట్ లాంగ్ వ్యాలిడిటీ, డైలీ డేటా, అదనపు డేటా మరియు మరిన్ని ఇతర ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం.
జియో యొక్క ఈ రూ. 899 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అందించే 90 రోజుల వ్యాలిడిటీ కాలానికి అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 2GB 4G డేటా మరియు డైలీ 100 SMS ప్రయోజనాలు ఆఫర్ చేస్తుంది. అదనంగా, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 20 GB అదనపు డేటా మరియు 5G నెట్ వర్క్ పై అన్లిమిటెడ్ 5జి డేట్ కూడా ఆఫర్ చేస్తుంది.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో మరిన్ని అదనపు ప్రయోజనాలు కూడా జియో ఆఫర్ చేస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 90 రోజుల జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. ఇది మాత్రమే కాదు 50GB Jio AI Cloud స్టోరేజ్ కూడా లభిస్తుంది. ఈ అన్ని ప్రయోజనాలతో పాటు జియో టీవీ కోసం ఉచిత యాక్సెస్ కూడా అందిస్తుంది.
ఈ ప్లాన్ అందించే పూర్తి ప్రయోజనాలు అందించే మరో ప్లాన్ ఒకటి వుంది. అదే, రూ. 859 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ మరియు ఈ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ జియో రూ. 899 ప్రీపెయిడ్ ప్లాన్ అందించే అన్ని ప్రయోజనాలు 84 రోజులు అందిస్తుంది.