Prime Day Sale నుంచి OnePlus 12R అన్ని వేరియంట్స్ పైన భారీ ఆఫర్స్ అందుకోండి.!

HIGHLIGHTS

ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలయ్యింది

Prime Day Sale నుంచి OnePlus 12R పై భారీ డీల్స్ అందించింది

ఈ ఫోన్ తో వన్ ప్లస్ బడ్స్ 3 ఇయర్ బడ్స్ సెట్ ను ఉచితంగా అందిస్తోంది

Prime Day Sale నుంచి OnePlus 12R అన్ని వేరియంట్స్ పైన భారీ ఆఫర్స్ అందుకోండి.!

ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలయ్యింది. Prime Day Sale నుంచి OnePlus 12R కొత్త కలర్ వేరియంట్ తో సహా అన్ని వేరియంట్స్ పైన భారీ ఆఫర్ లను అమెజాన్ అందించింది. వన్ ప్లస్ సరికొత్తగా విడుదల చేసిన కొత్త వన్ ప్లస్ 12R సన్ సెట్ డ్యూన్ కలర్ వేరియంట్ తోపాటు అన్ని వేరియంట్స్ పైన బ్యాంక్ డిస్కౌంట్ తో పాటు వన్ ప్లస్ బడ్స్ 3 ఇయర్ బడ్స్ సెట్ ను ఉచితంగా అందిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Prime Day Sale OnePlus 12R ఆఫర్

అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుంచి వన్ ప్లస్ 12R సన్ సెట్ డ్యూన్ స్మార్ట్ ఫోన్ కూడా ఈరోజు నుండి సేల్ కి అందుబాటులోకి వచ్చింది. వన్ ప్లస్ 12R ఫోన్ బేసిక్ వేరియంట్ ను రూ. 42,999 ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన రెండు గొప్ప ఆఫర్లను అందించింది. ఈ ఫోన్ ను ICICI మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనే యూజర్లకు రూ. 2,250 డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ పైన రూ. 5,499 రూపాయల విలువైన వన్ ప్లస్ బడ్స్ 3 ఇయర్ బడ్స్ ను ఉచితంగా కూడా పొందవచ్చు. Buy From Here

అయితే, ఈ ఆఫర్ కేవలం వన్ ప్లస్ బడ్స్ 3 ఇయర్ బడ్స్ స్టాక్ ఉన్నంత వరకూ మాత్రమే అని తెలిపింది.

Also Read: Sony Bravia 3 సిరీస్ స్మార్ట్ టీవీ లను భారీ ఫీచర్స్ తో లాంచ్ చేసిన సోనీ.!

OnePlus 12R సన్ సెట్ డ్యూన్ : ఫీచర్లు

వన్ ప్లస్ 12R సన్ సెట్ డ్యూన్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ 1.5K LTPO Pro XDR స్క్రీన్ ను కలిగి వుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్, Dolby Vision, HDR 10+ సపోర్ట్ మరియు ఆక్వా టచ్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 2 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 8GB / 16GB LPDDR5X ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ 128GB మరియు 256GB స్టోరేజ్ ఆప్షన్ లలో లభిస్తుంది.

OnePlus 12R
OnePlus 12R

ఈ ఫోన్ లో 50MP Sony IMX890 మెయిన్ సెన్సార్, Sony IMX355 అల్ట్రా వైడ్ సెన్సార్ లు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. ఇది అద్భుతమైన ఫోటోలు మరియు 4K UHD వీడియోలు అందిస్తుంది. ఈ ఫోన్ లో 100W సూపర్ ఊక్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5500mAh బిగ్ బ్యాటరీ కూడా వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo