Nothing Phone 4a: న్యూ లుక్స్ మరియు నెవర్ బిఫోర్ ఆఫర్స్ తో లాంచ్ అయ్యింది.!

HIGHLIGHTS

నథింగ్ బ్రాండ్ నుంచి ఈరోజు 4a సిరీస్ లాంచ్ అయ్యింది

బడ్జెట్ మోడల్ నథింగ్ ఫోన్ 4a ను కూడా అందించింది

Glyph Bar LED లైటింగ్ వంటి సరికొత్త డిజైన్ లో లాంచ్ అయ్యింది

Nothing Phone 4a: న్యూ లుక్స్ మరియు నెవర్ బిఫోర్ ఆఫర్స్ తో లాంచ్ అయ్యింది.!

Nothing Phone 4a: నథింగ్ బ్రాండ్ నుంచి ఈరోజు 4a సిరీస్ లాంచ్ అయ్యింది. ఈ సిరీస్ నుంచి అందించిన బడ్జెట్ మోడల్ నథింగ్ ఫోన్ 4a ను కూడా అందించింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన ట్రాన్స్‌పరెంట్ డిజైన్ మరియు Glyph Bar LED లైటింగ్ వంటి సరికొత్త డిజైన్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ ఆఫర్స్ లో భాగంగా నెవర్ బిఫోర్ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nothing Phone 4a: ధర

నథింగ్ ఫోన్ 4a ఫోన్ ను కూడా మూడు వేరియంట్లతో అందించింది. అలాగే, ఈ నథింగ్ మిడ్ రేంజ్ ఫోన్ ను మొత్తం నాలుగు రంగుల్లో అందించింది.

నథింగ్ ఫోన్ 4a (8GB + 128GB) ధర : రూ. 31,999

నథింగ్ ఫోన్ 4a (8GB + 256GB) ధర : రూ. 34,999

నథింగ్ ఫోన్ 4a (12GB + 256GB) ధర : రూ. 37,999

ఆఫర్స్

నథింగ్ ఫోన్ 4a ఫోన్ పై రూ. 4,000 భారీ ఎక్స్ చేంజ్ బోనస్ మరియు గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ను కంపెనీ అందించింది. అంతేకాదు, ICICI, HDFC మరియు One Card క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ఆప్షన్స్ తో రూ. 3,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

Also Read: Nothing Phone 4a Pro: సూపర్ డిజైన్ లో సర్ప్రైజింగ్ ప్రైస్ తో రిలీజ్ అయ్యింది.!

Nothing Phone 4a: స్పెక్స్ అండ్ ఫీచర్లు

నథింగ్ ఫోన్ 4a ఫోన్ 6.78 ఇంచ్ Flexible AMOLED డిస్ప్లేని 1.5K రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ గొరిల్లా Glass 7i ప్రొటెక్షన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ మరియు గరిష్టంగా 4,500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 4 ప్రోసెసర్ తో పని చేస్తుంది. ఇందులో 12 జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ కూడా ఉంటుంది. ఈ నథింగ్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 OS జతగా Nothing OS 4.1 సాఫ్ట్ వేర్ తో లాంచ్ అయ్యింది.

Nothing Phone 4a

ఈ నథింగ్ ఫోన్ 50MP ప్రధాన కెమెరా జతగా 50MP టెలిఫోటో కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ముందు ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 30FPS తో 4K వీడియో రికార్డింగ్, 70x అల్ట్రా జూమ్ మరియు అల్ట్రా XDR ఫోటో సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5400 mAh బ్యాటరీని మరియు 50W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఫోన్ ట్రాన్స్‌పరెంట్ డిజైన్ మరియు Glyph Bar LED లైటింగ్ తో ఆకట్టుకుంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo