Nothing Phone 4a Pro: సూపర్ డిజైన్ లో సర్ప్రైజింగ్ ప్రైస్ తో రిలీజ్ అయ్యింది.!

HIGHLIGHTS

నథింగ్ ఫోన్ 4a సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది

Nothing Phone 4a Pro ఇండియన్ మార్కెట్లో రిలీజ్ అయ్యింది

నథింగ్ ఫోన్ 4a ప్రో స్మార్ట్ ఫోన్ ను సూపర్ డిజైన్ లో సర్ప్రైజింగ్ ప్రైస్ తో వచ్చింది

Nothing Phone 4a Pro: సూపర్ డిజైన్ లో సర్ప్రైజింగ్ ప్రైస్ తో రిలీజ్ అయ్యింది.!

Nothing Phone 4a Pro: గత నెల రోజులుగా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి భీభత్సంగా టీజింగ్ చేసిన నథింగ్, ఎట్టకేలకు ఈరోజు ఈ కొత్త ఫోన్లను విడుదల చేసింది. నథింగ్ ఫోన్ 4a సిరీస్ నుండి రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. అయితే, వీటిలో ప్రీమియం ఆ స్మార్ట్ ఫోన్ అయిన నథింగ్ ఫోన్ 4a ప్రో స్మార్ట్ ఫోన్ ను సూపర్ డిజైన్ లో సర్ప్రైజింగ్ ప్రైస్ తో ఇండియన్ మార్కెట్లో రిలీజ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Nothing Phone 4a Pro: ప్రైస్

నథింగ్ ఫోన్ 4a ప్రో స్మార్ట్ ఫోన్ ను మూడు వేరియంట్స్ మరియు మూడు కలర్ ఆప్షన్స్ లో విడుదల చేసింది. ఈ మూడు వేరియంట్ ధరలు ఇక్కడ చూడవచ్చు.

నథింగ్ ఫోన్ 4a ప్రో (8GB + 128GB) ప్రైస్ : రూ. 39,999

నథింగ్ ఫోన్ 4a ప్రో (8GB + 256GB) ప్రైస్ : రూ. 42,999

నథింగ్ ఫోన్ 4a ప్రో (12GB + 256GB) ప్రైస్ : రూ. 45,999

ఈ స్మార్ట్ ఫోన్ ను బ్లాక్ , పింక్ మరియు సిల్వర్ మూడు రంగుల్లో అందించింది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ పై జబర్దస్త్ లాంచ్ ఆఫర్లు కూడా నథింగ్ అందించింది.

ఆఫర్స్

నథింగ్ ఫోన్ 4a ప్రో స్మార్ట్ ఫోన్ పై HDFC, One Card మరియు ICICI క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు ఆప్షన్స్ తో రూ. 4,000 రూపాయల భారీ అదనపు డిస్కౌంట్ ఆఫర్ అందించింది.

Nothing Phone 4a Pro: ఫీచర్స్

నథింగ్ ఫోన్ 4a ప్రో స్మార్ట్ ఫోన్ ను ప్రత్యేకమైన Glyph Matrix లైటింగ్ మరియు అల్యూమినియం యూని బాడీ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ లో 6.83 ఇంచ్ బిగ్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ మరియు గరిష్టంగా 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఐడి కాకుండా ఈ ఫోన్ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ రక్షణ కలిగి ఉంటుంది మరియు HDR10+ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.

Nothing Phone 4a Pro

నథింగ్ ఈ లేటెస్ట్ ఫోన్ ను క్వాల్కమ్ Snapdragon 7 Gen 4 చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఇది మంచి AI పెర్ఫార్మెన్స్ మరియు మంచి గ్రాఫిక్స్ పెర్ఫార్మెన్స్. ఈ ఫోన్ ను 8జీబీ / 12జీబీ ర్యామ్ మరియు 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్ తో అందించింది. ఈ ఫోన్ లేటెస్ట్ Nothing OS 4.1 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 16 OS పై నడుస్తుంది.

ఈ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో 50MP మెయిన్, 50MP పెరిస్కోప్ సెన్సార్ మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ఉన్నాయి. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరాని కూడా అందించింది. ఈ ఫోన్ 140x ultra zoom సపోర్ట్ తో వచ్చిన ప్రపంచపు మొదటి ఫోన్ గా ఈ ఫోన్ గురించి కంపెనీ అభివర్ణించింది. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ మరియు గొప్ప AI కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.

Also Read: Realme NARZO Power 5G: డ్యూయల్ చిప్ పవర్ తో మిడ్ రేంజ్ ధరలో లాంచ్ అయ్యింది.!

ఇక ఈ ఫోన్ కలిగిన బ్యాటరీ చూస్తే, ఈ ఫోన్ లో 5080 mAh బ్యాటరీ ఉంటుంది మరియు ఈ ఫోన్ ను చాలా వేగంగా ఛార్జ్ చేసే 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్ 3 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్గ్రేడ్ మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ కి హామీ ఇస్తుంది. ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్లు మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ IP65 రేటింగ్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo