Nothing Phone (3): లేటెస్ట్ క్వాల్కమ్ చిప్ సెట్ తో నథింగ్ ఫోన్ 3 లాంచ్ కన్ఫర్మ్ చేసింది.!
నథింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ దగ్గర పడుతుండటంతో టీజింగ్ స్పీడ్ పెంచేసింది
Nothing Phone (3) లేటెస్ట్ క్వాల్కమ్ చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది
ఈ ఫోన్ అంచనా స్పెక్స్ మరిన్ని ఫీచర్స్ గురించి చెబుతున్నాయి
Nothing Phone (3): నథింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఈ ఫోన్ కీలక ఫీచర్స్ తో టీజింగ్ స్పీడ్ పెంచేసింది. లేటెస్ట్ క్వాల్కమ్ చిప్ సెట్ తో నథింగ్ ఫోన్ 3 లాంచ్ చేస్తున్నట్లు ఈరోజు నథింగ్ కన్ఫర్మ్ చేసింది. అంటే, క్వాల్కమ్ లేటెస్ట్ గా తీసుకొచ్చిన కొత్త చిప్ సెట్ తో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. అంతేకాదు, ఈ ఫోన్ అంచనా స్పెక్స్ మరిన్ని ఫీచర్స్ గురించి చెబుతున్నాయి.
SurveyNothing Phone (3): లాంచ్ డేట్
జూలై 1వ తేదీన నథింగ్ ఫోన్ 3 ఇండియాలో విడుదల అవుతుంది. ఈ ఫోన్ కోసం నథింగ్ చాలా రోజులుగా టీజింగ్ చేస్తోంది. అయితే, ఈరోజు ఎట్టకేలకు ఈ అప్ కమింగ్ ఫోన్ ప్రోసెసర్ వివరాలు వెల్లడించింది. ఈ ఫోన్ కోసం ఫిప్ కార్ట్ అందించిన టీజర్ పేజీ మరియు కంపెనీ అఫీషియల్ X అకౌంట్ నుంచి ఈ వివరాలు అందించింది.
Nothing Phone (3): ఫీచర్స్
ఈ ఫోన్ కీలకమైన ఫీచర్ ను ఈరోజు నథింగ్ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను క్వాల్కామ్ 8 జనరేషన్ లేటెస్ట్ చిప్ సెట్ Snapdragon 8s Gen చిప్ సెట్ తో లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. ఇది 4nm TSMC చిప్ సెట్ మరియు ఇది గరిష్టంగా 3.21 GHz క్లాక్ స్పీడ్ కలిగి ఉంటుంది. ఈ చిప్ సెట్ ఓవరాల్ గా 2 లక్షలకు పైగా AnTuTu స్కోర్ అందించే పవర్ ఫుల్ చిప్ సెట్ మరియు గొప్ప AI సపోర్ట్ కలిగి ఉంటుంది.

నథింగ్ ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి ఎక్కువ వివరాలు వెల్లడించింది. కానీ, నెట్టింట్లో ఈ ఫోన్ అంచనా స్పెక్స్ ఇప్పటికే తెగ చక్కర్లు కొడుతున్నాయి. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న రూమర్స్ కనుక నిజమే అని నమ్మితే, ఈ ఫోన్ గొప్ప మెటల్ ఫ్రెమ్ మరియు యాంటీ రిఫ్లెక్టివ్ స్క్రీన్ తో లాంచ్ వచ్చే అవకాశం వుంది. ఇదే కాదు ఈ ఫోన్ లో సరికొత్త ఎసెన్షియల్ కీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ లో గొప్ప విజువల్స్ మరియు గేమింగ్ కు తగిన స్మూత్ డిస్ప్లే మరియు పవర్ ఫుల్ బ్యాటరీ కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read: Jio Network Problem: నెట్ వర్క్ ప్రాబ్లమ్ తో రెండో రోజు కూడా జియో యూజర్లకు ఇక్కట్లు.!
అయితే, నథింగ్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేసే వరకు ఈ రూమర్స్ ను ఎక్కువ సిరీస్ గా తీసుకునే ఛాన్స్ ఉండదు. కానీ, నథింగ్ ఈ ఫోన్ ను గొప్ప ఫీచర్స్ తో లాంచ్ చేస్తుందని మాత్రమే గట్టిగా చెబుతున్నారు. ఈ ఫోన్ మరిన్ని స్పెక్స్ మరియు ఫీచర్స్ కూడా నథింగ్ త్వరలోనే వెల్లడిస్తుంది.