Jio Network Problem: నిన్న దేశవ్యాప్తంగా జియో మొబైల్ నెట్ వర్క్ లో సమస్యలు చూసినట్లు వేల కొద్ది యూజర్లు ప్రముఖ అవుటేజ్ ప్లాట్ ఫామ్ డౌన్ డిక్టేటర్ ద్వారా రిపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈరోజు కూడా జియో నెట్ వర్క్ లో సమస్యలు చూస్తున్నట్లు యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో జియో నెట్ వర్క్ లో సమస్యలు చూసినట్లు యూజర్లు రిపోర్ట్ చేశారు. ఇందులో ఎక్కువగా కేరళ రాష్ట్ర యూజర్లు రిపోర్ట్ చేసినట్లు ఈ డౌన్ డిక్టేటర్ ద్వారా తెలుస్తోంది.
Survey
✅ Thank you for completing the survey!
Jio Network Problem:
దేశవ్యాప్తంగా అనేక మేజర్ సిటీలలో జియో నెట్ వర్క్ డౌన్ అయినట్లు యూజర్లు డౌన్ డిక్టేటర్ ద్వారా రిపోర్ట్ చేశారు. ఇందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి ఎక్కువ రిపోర్టులు నమోదు అయినట్లు తెలుస్తోంది. అయితే, నిన్న గరిష్ట స్థాయిలో కేరళ రాష్ట్ర యూజర్లు చేశారు. మధ్యాహ్నం నుంచి మొదలైన రిపోర్ట్స్ పర్వం సాయంత్రం వరకూ కొనసాగింది. అయితే, సాయంత్రానికి జియో నెట్వర్క్ గాడిలో పడినట్లు కనిపించింది.
అయితే, ఈరోజు ఉదయం 9 గంటలకు జియో నెట్వర్క్ డౌన్ అయినట్లు మళ్ళి రిపోర్ట్స్ నమోదు అయ్యాయి. ఈ రిపోర్ట్ పర్వం ఇప్పటికీ కొనసాగుతున్నట్లు డౌన్ డిక్టేటర్ వెల్లడిస్తోంది. ఇందులో ఎక్కువగా మొబైల్ ఇంటర్నెట్ గురించే యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు. నమోదైన రిపోర్ట్స్ లో గరిష్టంగా 51% జియో మొబైల్ ఇంటర్నెట్ లో సమస్య ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ఇక 34% మంది జియో ఫైబర్ గురించి రిపోర్ట్ చేయగా మిగిలిన 15% మంది యూజర్లు మాత్రం జియో మొబైల్ నెట్ వర్క్ లో ఇబ్బందులు చవి చూసినట్లు రిపోర్ట్ చేశారు.
యూజర్లు తమ అసహనానికి మరియు కలిగిన ఇబ్బంది తెలిపేలా డౌన్ డిక్టేటర్ నుంచి కామెంట్స్ కూడా పోస్ట్ చేశారు. అంతేకాదు, సోషల్ మీడియాలో కూడా రకరకాల ఫన్ని పోస్ట్ లతో విరుచుకు పడ్డారు. మేయు ఈ రిపోర్ట్ అందించే సమయానికి జియో పై యూజర్లు అందిస్తున్న రిపోర్ట్ సంఖ్య మెల్లగా తగ్గుముఖం పట్టింది.