Nokia 6.1 Plus మొట్టమొదటి సరిగా ఈ రోజు 12 PM కి ఇండియాలో విక్రయానికి ఉండనుంది : విడుదల ఆఫర్స్ , ధర, స్పెక్స్ ఇంకా మీకు కావాల్సిన మరిన్ని వివరాలతో….

HIGHLIGHTS

నోకియా 6.1 ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో మొదటి సారిగా అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇది Flipkart మరియు నోకియా ఆన్లైన్ స్టోర్ల ద్వారా అమ్మకానికి ఉండనుంది.

Nokia 6.1 Plus మొట్టమొదటి సరిగా ఈ రోజు 12 PM కి ఇండియాలో విక్రయానికి ఉండనుంది : విడుదల ఆఫర్స్ , ధర, స్పెక్స్ ఇంకా మీకు కావాల్సిన మరిన్ని వివరాలతో….

గత వారంలో న్యూ ఢిల్లీ లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమం ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసారు.  ఇప్పుడు నోచ్ డిస్ప్లే తో కూడిన ఈ నోకియా 6.1 ప్లస్ స్మార్ట్ ఫోన్  ఫ్లిప్ కార్ట్ మరియు నోకియా ఆన్లైన్ స్టోర్ల ద్వారా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు మొదటి సారిగా అమ్మకానికి సిద్దమవుతుంది.  ఈ నోకియా 6.1 కేవలం నోచ్ డిస్ప్లే నే కాకుండా స్నాప్ డ్రాగన్ 636 SoC మరియు డ్యూయల్ కెమెరా సెటప్ తో  మరింత బలంగా షియోమీ నోట్ 5 ప్రో కి ధీటుగా మార్కెట్లో నిలవనుంది అని మార్కెట్ వర్గాల అంచనా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

 Nokia 6.1 Plus  ధర మరియు లాంచ్ ఆఫర్లు

ఈ నోకియా 6.1 ప్లస్ ఇండియాలో రూ . 15,999 ధరతో వస్తుంది , అయితే కేవలం 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి యొక్క ఒక్క వేరియెంట్ తో మాత్రమే వస్తుంది.  ఇప్పటి వరకు Flipkart మరియు నోకియా ఆన్లైన్ స్టోర్ లలో ఇది ప్రీ – ఆర్డర్ కి మాత్రమే అందుబాటులో వుంది కానీ ఇప్పుడు ఇది డైరెక్ట్ ఆన్లైన్ సేల్స్ కి కూడా అందుబాటులో ఉంటుంది.  ఇండియాలో ఆగష్టు 31 నుండి ఈ ఫోన్ల షిప్పింగ్ ని కూడా మొదలుపెట్ట నుందని నోకియా అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియ వచ్చింది.

లాంచ్ ఆఫర్స్ ప్రకారంగా చుస్తే , జియో వినియోగదారులకు 240జీబీ (ప్రతి నెలా 20జీబీ 12 నెలలవరకు రూ . 199, రూ . 249 లేదా రూ . 448 రీచార్జి ప్లాన్ తో పాటు) ల కాంప్లిమెంటరీ డేటా  మరియు నెలకు రూ . 50 రూపాయల గల 36 వోచర్ల మొత్తం రూ . 1,800 ల కాష్ బ్యాక్ ని పొందే అవకాశముంది. కొనుగోలుధారులకి అదనంగా ఇక్కడ 'నో కాస్ట్ EMI' కూడా అందుబాటులో ఉంది.  అలాగే Flipkart వినియోగదారులు దీనిని Axis బ్యాంకు బజ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేయడంవలన 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది మరియు ICICI బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనడం వలన కూడా ఇదె వర్తింపు అనగా 5% తగ్గింపు లభిస్తుంది.

Nokia 6.1 Plus  స్పెసిఫికేషన్స్

నోకియా 6.1 ప్లస్  డ్యూయల్ – సిమ్  స్మార్ట్ ఫోన్, బాక్స్ నుండి బయటకు వస్తూనే ఆండ్రాయిడ్ ఒరెయో  తో పనిచేస్తుంది. ఈ ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్ కావడం వలన మనకి టైం ప్రకారం అప్డేట్స్ అందుతాయి. ఈ డివైజ్ 19: 9 యాస్పెక్ట్ రేషియో తో కూడిన 1080 x 2280 పిక్సల్స్ రిజల్యూషన్ గా కలిగిన 5.8 అంగుళాల పూర్తి హెచ్ డి +  డిస్ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 3  రక్షణతో  అందించబడింది.

 నోకియా 6.1 ప్లస్ స్నాప్ డ్రాగన్ 636 SoC, 4జీబీ LPDDR 4X ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి  తో అనుసంధానమవుతుంది. స్మార్ట్ ఫోన్ వెనుకవైపు 16ఎంపీ  +  5ఎంపీ తో డ్యూయల్ – కెమెరా సెటప్ ఉంటుంది, ఇంకా ముందు భాగంలో సెల్ఫీల కోసం  16ఎంపీ  కెమెరా ఉంటుంది. 64జీబీ  అంతర్గత మెమొరీలతో పాటుగా (దాదాపు 400జీబీ వరకు) స్టోరేజీ విస్తరించగల స్మార్ట్ ఫోన్. ఒక 3060mAh బ్యాటరీ మొత్తం ప్యాకేజీకి అవసరమైన  శక్తినందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo