Nokia 5.3 అమ్మకాలు మొదలు…ఇవే ప్రత్యేకతలు

Nokia 5.3 అమ్మకాలు మొదలు…ఇవే ప్రత్యేకతలు
HIGHLIGHTS

HMD గ్లోబల్ లేటెస్ట్ గా ఇండియాలో లాంచ్ చేసిన Nokia 5.3 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అమేజాన్ మరియు Nokia.com ద్వారా కొనడానికి అందుబాటులో వుంది.

Nokia స్మార్ట్ ఫోన్స్ అంటేనే స్టాక్ ఆండ్రాయిడ్ తో ప్రధాన అప్డేట్స్ ముందుగా అందుకునే ఫోన్లుగా మనకు తెలుసు.

ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 10 తో పని చేస్తుంది.

Nokia స్మార్ట్ ఫోన్స్ అంటేనే స్టాక్ ఆండ్రాయిడ్ తో ప్రధాన అప్డేట్స్ ముందుగా  అందుకునే ఫోన్లుగా మనకు తెలుసు. ఇక HMD గ్లోబల్ లేటెస్ట్ గా ఇండియాలో లాంచ్ చేసిన Nokia  5.3 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు  అమేజాన్ మరియు Nokia.com ద్వారా కొనడానికి అందుబాటులో వుంది. కేవలం రూ .13,999 ధరలో మంచి ప్రత్యేకతలతో పాటుగా బ్రాండ్ వ్యాల్యూని అందించే ఈ స్మార్ట్ ఫోన్ కొనే ముందుగా మీరు తెల్సుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ చూడవచ్చు.    

Nokia 5.3: డిస్ప్లే

ఈ Nokia 5.3 ఒక 6.55-అంగుళాల HD + (1600 x 700 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది ముందు భాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో 20: 9 యాస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. సాధారణ ప్రమాదాల నుండి అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 3 పొరతో ఈ స్క్రీన్ సేఫ్టీ చెయ్యబడింది. ఇది 8.5 మిల్లీ మీటర్ల మందం మరియు 185 గ్రాముల బరువు కలిగి ఉంటుంది.

Nokia 5.3: పెర్ఫార్మెన్స్

నోకియా 5.3 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 SoC  ఆక్టా-కోర్ ప్రాసెసర్ మరియు అడ్రినో 610 GPU తో పనిచేస్తుంది. ఇది 3GB / 4GB / 6GB RAM మరియు 64GB స్టోరేజ్‌ తో జతచేయబడి మైక్రో SD కార్డ్‌ ను ఉపయోగించి మరింత విస్తరించే ఎంపికతో ఉంటుంది. ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 10 తో పని చేస్తుంది.

Nokia 5.3: కెమేరా&బ్యాటరీ

ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ‌తో వస్తుంది, దీనిలో ఎఫ్ / 1.8 ఎపర్చరుతో 13 MP ప్రాధమిక కెమెరా,  5 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP  మాక్రో కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. వెనుక కెమెరాలు 30KPS వద్ద 4K UHD వరకు రికార్డ్ చేయగలవు. ముందు వైపు, 8MP సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్ లోపల ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ ఒక పెద్ద 4,000mAh బ్యాటరీతో తీసుకొచ్చింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo