HMD Skyline : హెచ్ఎండి కొత్త ఫోన్ టాప్ 5 ఫీచర్స్ మరియు ప్రైస్ తెలుసుకోండి.!

HIGHLIGHTS

HMD Skyline స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో సరికొత్తగా పరిచయం చేసింది

నోకియా లూమియా మాదిరి డిజైన్ ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది

ఏదైనా సమస్య వచ్చినప్పుడు సొంతంగా రిపేర్ చేసుకునే విధంగా ఈ ఫోన్ ను అందించింది

HMD Skyline : హెచ్ఎండి కొత్త ఫోన్ టాప్ 5 ఫీచర్స్ మరియు ప్రైస్ తెలుసుకోండి.!

HMD Skyline స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో సరికొత్తగా పరిచయం చేసింది. నోకియా లూమియా మాదిరి డిజైన్ ఈ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. అయితే, ఈ ఫోన్ లో సరికొత్త ఫీచర్స్ మరియు సెల్ఫ్ రిపేర్, అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సొంతంగా రిపేర్ చేసుకునే విధంగా ఈ ఫోన్ ను అందించింది. హెచ్ఎండి సరికొత్తగా విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

HMD Skyline : ప్రైస్

హెచ్ఎండి ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను రూ. 35,999 ధరతో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ hmd.com మరియు రిటైల్ స్టోరేజ్ నుంచి సేల్ అవుతుంది.

HMD Skyline : టాప్ 5 ఫీచర్స్

HMD Skyline top 5 Features

డిజైన్

HMD ఈ స్మార్ట్ ఫోన్ ను నోకియా లూమియా ను పోలిన డిజైన్ తో అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ సెల్ఫీ రిపేర్ ఫీచర్ తో మరింత సౌకర్యంగా ఉంటుంది. ఈ ఫోన్ 100% రీ సైకిల్ అల్యుమినియం ఫ్రెమ్ తో వస్తుంది.

స్క్రీన్

6.55 ఇంచ్ pOLED స్క్రీన్ ఈ ఫోన్ లో వుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్, HDR 10 సపోర్ట్ మరియు 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ తో వస్తుంది మరియు గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో ఉంటుంది.

ప్రోసెసర్

హెచ్ఎండి స్కైలైన్ స్మార్ట్ ఫోన్ Snapdragon 7s Gen 2 5G చిప్ సెట్ మరియు 12GB ర్యామ్ తో గొప్ప పెర్ఫార్మెన్స్ అందిస్తుందని హెచ్ఎండి తెలిపింది. ఫోటోలు మరియు మీడియా కోసం ఈ ఫోన్ లో హెవీ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా అందించింది.

Also Read: Flipkart బిగ్ డీల్: సగం ధరకే లభిస్తున్న CMF Watch Pro స్మార్ట్ వాచ్.!

కెమెరా

ఈ హెచ్ఎండి కొత్త 5జి స్మార్ట్ ఫోన్ AF తో OIS సపోర్ట్ కలిగిన 108MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా మరియు 50MP టెలీ ఫోటో సెన్సార్లు కలిగిన ట్రిపుల్ రియర్ తో వచ్చింది. ఈ ఫోన్ ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా కూడా వుంది.

బ్యాటరీ

ఈ హెచ్ఎండి ఫోన్ 4600 mAh బ్యాటరీ కలిగి వుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్, 15W మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జ్ మరియు 5W రివర్స్ ఛార్జ్ సపోర్ట్ లను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo