Motorola Signature సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్ టీజర్ విడుదల చేసింది.!
Motorola Signature స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతున్నట్లు మోటోరోలా టీజర్ విడుదల చేసింది
ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి కొత్త టీజర్ కూడా అందించింది
ఈ ఫోన్ ను Snapdragon 8 Gen 5 చిప్ సెట్ చేసే అవకాశం ఉందని లీక్స్ చెబుతున్నాయి
Motorola Signature స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయబోతున్నట్లు మోటోరోలా టీజర్ విడుదల చేసింది. ముందుగా, డిసెంబర్ 28న ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి హింట్ ఇస్తూ టీజర్ విడుదల చేసింది. నిన్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గురించి మరో కొత్త టీజర్ కూడా అందించింది. అంతేకాదు, ప్రీమియం అంటే మీ డెఫినేషన్ ఏమిటో తెలియజేయండి, అని టీజర్ క్యాంపైన్ కూడా మొదలు పెట్టింది.
SurveyMotorola Signature
మోటోరోలా సిగ్నేచర్ సిరీస్ లాంచ్ కోసం అఫీషియల్ x అకౌంట్ నుంచి టీజింగ్ స్టార్ట్ చేసింది. ఒక ప్రీమియం ఫోన్ అంటే ఒక సిగ్నేచర్ కలిగి ఉండాలి మరియు మోటోరోలా ఫోన్ ప్రీమియం సిగ్నేచర్ తో వస్తోంది, అని టీజింగ్ చేసింది. మోటోరోలా అఫీషియల్ x అకౌంట్ నుంచి ఈ టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ ఫోన్ పేరు లేదా ఈ ఫోన్ లాంచ్ డేట్ లేదా ఈ ఫోన్ వివరాలు కూడా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ 2026 లో మోటోరోలా నుంచి వచ్చే మొట్టమొదటి ఫోన్ అవుతుంది.
Motorola Signature : లీక్స్
అనేక టెక్ గ్యాడ్జెట్స్ మరియు ప్రొడక్ట్స్ డీటెయిల్స్ లీక్ కి వేదికైన X ప్లాట్ ఫామ్, ఈ మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాల లీక్ కు కూడా వేదికగా మారింది. ఈ ప్లాట్ ఫామ్ ఈ మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ వివరాలు వెల్లడించిన ఇమేజెస్ కొన్ని దర్శనమిచ్చాయి. ఈ ఇమేజెస్ ద్వారా ఈ ఫోన్ సిరీస్ పేరు మరియు కొన్ని ఇతర వివరాలు వెల్లడయ్యాయి. ఇందులో, ఈ ఫోన్ డిజైన్, కెమెరా మరియు ఇతర వివరాలు ఉన్నాయి.

ఆన్లైన్ లో లీకైన ఇమేజ్ నుంచి 1973 లో మోటోరోలా ఫస్ట్ పోర్ట్రబుల్ ఫోన్ అందించిన నాటి నుంచి కొత్త ఆవిష్కరణ మా సిగ్నేచర్ గా కొనసాగుతున్నాము, ఇప్పుడు కూడా కొత్త ఆవిష్కరణ మీ ముందుకు తీసుకొస్తున్నాము, అని చెబుతోంది. ఈ ఫోన్ అప్ కమింగ్ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో ఉన్నట్లు లీక్డ్ ఇమేజెస్ చెబుతున్నాయి. ఇది మాత్రమే కాదు, ఈ ఫోన్ ను Snapdragon 8 Gen 5 చిప్ సెట్, సూపర్ టెలిఫోటో కెమెరా మరియు లగ్జరీ ఫ్యాబ్రిక్ డిజైన్ వంటి సిగ్నేచర్ ఫీచర్స్ తో ఈ ఫోన్ సిరీస్ ను ఇండియాలో విడుదల చేయడానికి మోటోరోలా సిద్ధమవుతోందని ఈ లీక్స్ సూచిస్తున్నాయి.
Also Read: Realme 16 Pro Plus 5G: కంపెనీ కన్ఫర్మ్ చేసిన టాప్ 5 ఫీచర్లు ఇవే.!
అయితే, మోటోరోలా ఈ ఫోన్ గురిఞ్చి అఫీషియల్ గా వివరాలు అందించే వరకు పూర్తిగా నమ్మడానికి అవకాశం ఉండదు. అయితే, ఇమేజెస్ చూస్తుంటే, మాత్రం ఈ అప్ కమింగ్ ఫోన్ మార్కెట్లో చాలా కొత్త ఫీచర్స్ మరియు కొత్త డిజైన్ తో లాంచ్ అయ్యేలా కనిపిస్తోంది. మరి చూద్దాం మోటోరోలా ఈ ఫోన్ గురించి ఎలాంటి ప్రకటన చేస్తుందో.