Moto G96 5G: మోటోరోలా G సిరీస్ నుంచి పవర్ ఫుల్ ఫోన్ లాంచ్ చేస్తోంది.!
నిన్నటి వరకు కేవలం ‘Coming Soon’ ట్యాగ్ తో ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ చేసిన మోటోరోలా
ఈరోజు ఈ అప్ కమింగ్ ఫోన్ పేరు మరియు లాంచ్ వివరాలు వెల్లడించింది
మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మోటో జి 96 5జి
Moto G96 5G : నిన్నటి వరకు కేవలం ‘Coming Soon’ ట్యాగ్ తో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ చేసిన మోటోరోలా, ఈరోజు ఈ అప్ కమింగ్ ఫోన్ పేరు మరియు లాంచ్ వివరాలు వెల్లడించింది. అదే, మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ మోటో జి 96 5జి. ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పటి వరకు మోటో G సిరీస్ లో వచ్చిన అన్ని ఫోన్స్ కంటే పవర్ ఫుల్ ఫోన్ గా వస్తోంది. ఈ అప్ కమింగ్ ఫోన్ వివరాలు ఏమిటో వివరంగా చూద్దామా.
SurveyMoto G96 5G : లాంచ్
మోటో జి 96 5జి స్మార్ట్ ఫోన్ ను జూలై 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు మోటోరోలా లాంచ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ప్రత్యేకమైన సేల్ పార్ట్నర్ గా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ కోసం అందించిన ప్రత్యేకమైన టీజర్ పేజి నుంచి ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ కూడా టీజింగ్ చేస్తోంది.
Moto G96 5G : కీలక ఫీచర్స్
మోటో జి 96 5జి స్మార్ట్ ఫోన్ ను అల్ట్రా ప్రీమియం లెథర్ డిజైన్ కలిగి ఉంటుంది. జి 96 5జి ఫోన్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ కలిగిన 6.67 ఇంచ్ 3D కర్వుడ్ pOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ SGS ఐ ప్రొటెక్షన్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు కలర్ బూస్ట్ ఫీచర్ వంటి ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మోటో ai సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

ఈ మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ యొక్క పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 7s Gen 2 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో ఈ చిప్ సెట్ కి జతగా తగిన ర్యామ్ మరియు టర్బో ర్యామ్ ఫీచర్ ని కూడా అందించే అవకాశం ఉండవచ్చు. మోటో ఈ ఫోన్ ను కూడా IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా అందిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో వాటర్ టచ్ ఫీచర్ ని అందిస్తుంది. అంటే చేతులు తడిగా ఉన్నా లేదా స్క్రీన్ పై నీళ్లు పడితే కూడా స్క్రీన్ చక్కగా పని చేస్తుంది.
Also Read: Ai Plus Smartphone: కేవలం రూ. 5000 సెగ్మెంట్ లో AI ఫోన్ లాంచ్ చేస్తున్న కొత్త కంపెనీ.!
మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కెమెరా వివరాలు కూడా మోటోరోలా ఇప్పటికే వెల్లడించింది. మోటో జి 96 స్మార్ట్ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇందులో 50MP Sony LYT 700 కెమెరా OIS సపోర్ట్ తో ఉంటుంది. ఇది 4K వీడియో రికార్డింగ్ మరియు మంచి AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లు కూడా తర్వలో వెల్లడించే అవకాశం వుంది.