Motorola Edge S క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 తో వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్ గా నిలిచింది. ఈ మోటోరోలా ఎడ్జ్ S స్మార్ట్ ఫోన్ చైనాలో విడుదలయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 865+ యొక్క అప్గ్రేడెడ్ వెర్షన్ గా ఈ స్నాప్ డ్రాగన్ 870 ఈ నెల ప్రారంభంలో ప్రకటించబడింది. అంతేకాదు, Edge S స్మార్ట్ ఫోన్ ముందుభాగంలో డ్యూయల్ సెల్ఫీ కెమేరాని కూడా కలిగి వుంది.
Survey
✅ Thank you for completing the survey!
Motorola Edge S స్పెషిఫికేషన్స్
Motorola Edge S స్మార్ట్ ఫోన్ పెద్ద 6.7 అంగుళాల FHD+ (2520 x 1080) డిస్ప్లేని కలిగివుంది. ఈ డిస్ప్లే90 Hz రిఫ్రెష్ రేటుతో మరియు HDR 10 సర్టిఫికేషన్ తో వస్తుంది. Edge S స్మార్ట్ ఫోన్ 3.2 GHz వరకు క్లాక్ స్పీడ్ అందించగల క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 తో వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్. ఇది Adreno 650 GPU తో వస్తుంది మరియు 8GB ర్యామ్ మరియు 256 GB స్టోరేజ్ అప్షన్లతో వస్తుంది. స్టోరేజ్ ను మరింతగా పెంచుకోవడానికి SD కార్డు అప్షన్ కూడా ఇవ్వబడింది.
మోటోరోలా ఎడ్జ్ S లోని కెమెరాలా విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ కెమెరా సెటప్, అంటే నాలుగు కెమెరాల సెటప్ వుంది. ఈ క్వాడ్ కెమెరా సెటప్ లో 64MP ప్రధాన కెమెరా, 16MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ మరియు 3D ToF (టైం-ఆఫ్-ఫ్లైట్) సెన్సార్ వున్నాయి. ఇక ఈ ఫోన్ ముందుభాగంలో సెల్ఫీల కోసం డ్యూయల్ సెల్ఫీ కెమెరాని పూంచ్ హోల్ డిజైన్ లో అందించింది. ఇందులో, 16MP ప్రధాన కెమెరా మరియు 8MP అల్ట్రా వైడ్ సెన్సార్ ని ఉంచింది. స్మార్ట్ ఫోన్ మొత్తానికి పవర్ అందించడాని 5,000 mAh బ్యాటరీని 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అందించింది.
Motorola Edge S స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఎప్పడు రిలీజ్ అవుతుందనే విషయం ఇంకా ప్రకటించలేదు. `