Motorola Edge 50 Fusion: బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో ఇండియాలో లాంచ్ అయ్యింది.!
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు ఈరోజు లాంచ్ అయ్యింది
Sony కొత్త సెన్సార్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో విడుదల చేసింది
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది
Motorola Edge 50 Fusion: మోటోరోలా గత రెండు వారాలుగా టీజింగ్ చేస్తుం వస్తున్న మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు ఈరోజు లాంచ్ అయ్యింది. గొప్ప డిస్ప్లే, సోనీ కొత్త సెన్సార్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలో విడుదల చేసింది. ఈరోజే మార్కెట్ లో విడుదలైన ఈ కొత్త ఫోన్ ప్రైస్, స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.
Motorola Edge 50 Fusion Price
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ను రెండు వేరియంట్లలో విడుదల చేసింది. ఈ ఫోన్ వేరియంట్ ధరలు ఇక్కడ చూడవచ్చు.
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (8GB + 128GB) ధర : రూ. 22,999
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (12GB + 256GB) ధర : రూ. 24,999
మోటోరోలా ఈ ఫోన్ ను 25 వేల రూపాయల ఉప బడ్జెట్ లో 12GB RAM మరియు 256 స్టోరేజ్ తో అందించింది. ఈ ఫోన్ మొదటి సేల్ మే 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart నుంచి మొదలవుతుంది.
ఆఫర్స్
ఈ ఫోన్ పైన రూ. 2,000 రూపాయల ICICI బ్యాంక్ కార్డ్స్ డిస్కౌంట్ అఫర్ మరియు రూ. 2,000 ఎక్స్ చేంజ్ తగ్గింపు ఆఫర్లను అందించింది. అంటే, ఈ ఆఫర్లతో ఈ ఫోన్ ను రూ. 20,999 ప్రారంభ ధరతో అందుకోవచ్చు.
Also Read: HMD Arrow: Nokia యాజమాన్య కంపెనీ నుంచి మొదటి ఫోన్ వస్తోంది.!
Motorola Edge 50 Fusion: ఫీచర్స్
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ 3D Curved డిస్ప్లేని 144 Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి వుంది. ఈ స్క్రీన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు గొరిల్లా గ్లాస్ రక్షణ కలిగివుంది. ఈ ఫోన్ Snapdragon 7s Gen 2 ఫాస్ట్ ప్రోసెసర్ జతగా 12GB RAM మరియు 12GB RAM Boost ఫీచర్ తో కలిగిన వుంది. ఈ ఫోన్ 256 GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ మరియు IP68 అండర్ వాటర్ ప్రొటెక్షన్ ఫీచర్ ను కూడా కలిగి వుంది.
ఎడ్జ్ 50 ఫ్యూజన్ ఫోన్ లో 50 MP Ultra Pixel OIS సపోర్ట్ కలిగిన Sony – LYTIA 700C మెయిన్ సెన్సార్ వుంది, దీనికి జతగా 13MP (అల్ట్రా వైడ్ + మైక్రో) కెమెరా వుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా ని కూడా కంపెనీ అందించింది. ఈ ఫోన్ లో ఉన్న సెల్ఫీ మరియు బ్యాక్ కెమెరా కూడా 4K వీడియో రికార్డ్ సపోర్ట్ ను కలిగి ఉందని మోటోరోలా తెలిపింది.
ఈ మోటోరోలా మాకొత్త ఫోన్ Hello UI సాఫ్ట్ వేర్ పైన Android 14 OS తో నడుస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ 3 years OS అప్డేట్లను అందుకుందని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ వుంది.