Motorola అప్ కమింగ్ ఫోన్ లాంచ్ కోసం టీజింగ్ మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను ఎక్కువ సమయం నిలిచి ఉండే బిగ్ బ్యాటరీతో లాంచ్ చేయబోతున్నట్లు టీజర్ ద్వారా వెల్లడించింది. మరి మోటోరోలా అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ మరియు ఈ ఫోన్ గురించి కంపెనీ అందించిన వివరాలు ఏమిటో ఒక్క లుక్కేద్దాం పదండి.
Survey
✅ Thank you for completing the survey!
Motorola అప్ కమింగ్ ఫోన్ ఏమిటి?
మోటోరోలా తీసుకురాబోతున్న అప్ కమింగ్ ఫోన్ పేరు లేదా లాంచ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే, ఈ ఫోన్ వచ్చే నెలలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. త్వరలోనే మోటోరోలా ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఫోన్ పేరు వంటి మరిన్ని ఇతర వివరాలు అందించే అవకాశం ఉంటుంది.
మోటోరోలా అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ గొప్ప బ్యాటరీ తో లాంచ్ అవుతుందని మోటోరోలా ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ డిజైన్ మరియు ఈ ఫోన్ గురించి కంపెనీ చెబుతున్న వివరాలు చూస్తుంటే, ఈ ఫోన్ ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఫోన్స్ కంటే కూడా భారీ mAh బ్యాటరీ కలిగి ఉండే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. అంటే, ఈ ఫోన్ లో 7000 mAh కంటే అధిక శక్తి కలిగిన బ్యాటరీ ఉండవచ్చునేమో అని అంచనా వేస్తున్నారు.
అయితే, ఇది అంచనా మాత్రమే కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా బయటకు వెల్లడించలేదు. ఈ ఫోన్ డిజైన్ పరంగా చూస్తే, ఈ ఫోన్ కొంచెం మందంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకు నాజూకైన ఫోన్లు అందించిన మోటోరోలా, బిగ్ బ్యాటరీ కారణంగా ఈ ఫోన్ ను కొంచెం మందంగా అందిస్తున్నట్లు భావిస్తున్నారు.
ఇక మరిన్ని ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ టీజర్ ఇమేజ్ ద్వారా ఈ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు చూడవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ లో 50MP సోనీ మెయిన్ కెమెరా మరియు AI కెమెరా ఫీచర్స్ ఉన్నట్లు కూడా ఈ ఇమేజ్ ద్వారా వెల్లడి అవుతుంది. ఈ మోటోరోలా అప్ కమింగ్ ఫోన్ లాంచ్ డేట్ మరియు మరిన్ని కీలకమైన ఫీచర్స్ కూడా మోటోరోలా త్వరలోనే అందించే అవకాశం ఉంది.