బడ్జెట్ పవర్ ఫుల్ ఫోన్ Moto G67 Power 5G ఫస్ట్ సేల్.!
Moto G67 Power 5G స్మార్ట్ ఫోన్ గత వారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది
ఈ ఫోన్ మొదటి సేల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం అవుతుంది
ఈ ఫోన్ 15 వేల రూపాయల బడ్జెట్ ప్రైస్ లో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది
Moto G67 Power 5G స్మార్ట్ ఫోన్ గత వారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది మరియు ఈ ఫోన్ మొదటి సేల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం అవుతుంది. ఈ ఫోన్ 15 వేల రూపాయల బడ్జెట్ ప్రైస్ లో ఇండియన్ మార్కెట్లో అడుగుపెట్టింది. అయితే, ఈ ఫోన్ బడ్జెట్ ధరలో భారీ ఫీచర్స్ తో వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ మరియు ఫస్ట్ సేల్ నుంచి లభించే ఆఫర్ వివరాలు తెలుసుకోండి.
SurveyMoto G67 Power 5G : ప్రైస్
మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 15,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ పాంటనోన్ సిలేంట్రో, పాంటనోన్ క్యూరకో బ్లూ మరియు పాంటనోన్ పారాస్యుట్ మూడు రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్ ఫస్ట్ సేల్ నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. ఫ్లిప్ కార్ట్ మరియు మోటోరోలా అఫీషియల్ సైట్ నుంచి ఈ ఫోన్ సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ పై రూ. 1,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ మరియు రూ. 1,000 రూపాయల అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ అందించింది. అయితే, ఈ రెండు ఆఫర్స్ లో ఏదైనా ఒకటి మాత్రమే లభిస్తుంది.
Also Read: LED టీవీ రేటుకే Samsung QLED స్మార్ట్ టీవీ అందుకోండి.!
Moto G67 Power 5G : ఫీచర్స్
మోటో జి67 పవర్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ FHD+ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు గొరిల్లా గ్లాస్ 7i రక్షణ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 2 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 8 జీబీ ర్యామ్ తో పాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ MIL-810H మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ డిజైన్ తో ఉంటుంది మరియు IP64 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ తో వస్తుంది.

కెమెరా పరంగా, ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు మరో కెమెరా కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ 4K ఫ్రెంట్ అండ్ బ్యాక్ రెండు కెమెరాలు కూడా 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 7000 mAh బిగ్ బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో డాల్బీ అట్మాస్ మరియు హై రిజల్యూషన్ ఆడియో సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది.