మోటోరోలా ఇండియాలో సరికొత్తగా విడుదల చేసిన బడ్జెట్ Dolby Atmos సౌండ్ సపోర్ట్ ఫోన్ Moto G32 ఫస్ట్ సేల్ ఆగష్టు 16 న జరగనుంది. మోటోరోలా G32 స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.12,999 రూపాయల ధరలో Dolby Atoms సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లతో తీసుకొచ్చింది. అంతేకాదు, 50MP క్వాడ్ ఫంక్షన్ కెమెరాతో పాటుగా గొప్ప ఆకర్షణీయమైన ఫీచర్లను కూడా ఈ ఫోన్ లో అందించింది.
Survey
✅ Thank you for completing the survey!
Moto G32: ధర మరియు లాంచ్ ఆఫర్లు
Moto G32 కేవలం రూ.12,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఇది 4GB ర్యామ్ మరియు 64GB వేరియంట్ కోసం నిర్ణయించిన ధర. ఈ ఫోన్ ఆగష్టు 16 నుండి Flipkart ద్వారా ఉపలబ్ధమవుతుంది.
Moto G32 ఫోన్ 6.55 ఇంచ్ FHD+ IPSLCD డిస్ప్లేని ఈ ఫోన్ కలిగివుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది మరియు 20:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. సెల్ఫీ కెమెరా కోసం పైన మధ్య భాగంలో పంచ్ హోల్ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ లను అందిస్తుంది.
కెమెరా మరియు ఇతర ఫీచర్ల పరంగా ఈ ఫోన్ వెనుక 50MP క్వాడ్ ఫిక్షన్ రియర్ కెమెరాతోని కలిగివుంది. ఇందులో 50MP మైన్ కెమెరా, 8ఎంపి సెన్సార్ అల్ట్రా-వైడ్ మరియు డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుంది. చివరిగా 2MP మ్యాక్రో సెన్సార్ కూడా వుంది. ఇక సెల్ఫీల కోసం పంచ్ హోల్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 33W టర్బో పవర్ ఛార్జర్ తో కలిగివుంది.
ఈ ఫోన్ మరిన్ని ఫీచర్లను చూస్తే, ఇది స్టాక్ ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది మరియు IPX2 వాటర్ రెపెల్లంట్ డిజైన్ తో వస్తుంది. అద్భుతమైన మ్యూజిక్ మరియు మూవీ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో Dolby Atmos సౌండ్ టెక్నాలజీ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా వున్నాయి.