Moto e7 Power: ఆకట్టుకునే ఫీచర్లతో అతి తక్కువ ధరలో విడుదల

Moto e7 Power: ఆకట్టుకునే ఫీచర్లతో అతి తక్కువ ధరలో విడుదల
HIGHLIGHTS

ఈరోజు విడుదలైన Moto e7 Power

ఈ లేటెస్ట్ మోటోరోలా ఫోన్ తక్కువ ధరలో వచ్చింది.

మోటో e7 పవర్ 2X2 MIMO నెట్ వర్క్ సపోర్ట్ తో వస్తుంది.

మోటోరోలా తన Moto e7 Power ను ఈరోజు ఇండియాలో విడుదల చేసింది. మోటోరోలా మోటో e7 పవర్ స్టాక్ ఆండ్రాయిడ్ తో ఎటువంటి బ్లోట్ వేర్ సమస్య లేకుండా వస్తుంది. అంతేకాదు, ఇందులో పెద్ద బ్యాటరీ, పెద్ద డిస్ప్లే మరియు పెద్ద డిస్ప్లే వంటి ఫీచర్లతో పాటుగా మరికొన్ని ఫీచర్లను అందించింది. Moto e7 Power ను మాత్రం కేవలం Rs. 7,499 రుపాయల తక్కువ ధరకే ప్రకటించింది.

Moto e7 Power: ధర

Moto e7 Power యొక్క మొదటి సేల్ ఫిబ్రవరి 26 న మధ్యాహ్నం గంటలకి మొదలవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ 2GB మరియు 32GB స్టోరేజ్, 4GB మరియు 64GB స్టోరేజ్ గల వేరియంట్ తో లాంచ్ అయ్యింది.

Moto e7 Power 2GB మరియు 32GB స్టోరేజ్: ధర – Rs.7,499

Moto e7 Power 4GB మరియు 64GB స్టోరేజ్ ధర: Rs.8,299

ఇక ఈ ఫోనుకు సంభందించిన పూర్తి స్పెషిఫికేషన్లను ఈ క్రింద చూడవచ్చు.

మోటోరోలా మోటో e7 పవర్: స్పెషిఫికేషన్స్

మోటోరోలా మోటో e7 పవర్ పెద్ద 6.5 అంగుళాల HD డిస్ప్లేని వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే పొడవుగా 20:9 ఎస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ Helio G25 ఆక్టా కోర్ ప్రోసిజర్ శక్తితో పనిచేస్తుంది. దీనికి జతగా వేగవంతమైన LPDDR4X 4GB ర్యామ్ మరియు పెద్ద 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అయితే, మైక్రో SD కార్డు అప్షన్ కూడా ఇవ్వబడింది. దీనితో 1TB వరకు మెమోరిని పెంచుకోవచ్చు.

కెమెరా పరంగా, మోటో e7 పవర్  ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ వుంటుంది. ఇందులో, 13MP మైన్ కెమెరా మరియు 2MP మ్యాక్రో కెమెరా వున్నాయి. ఇక సెల్ఫీల కోసం ఫోన్ ముందు వైపు 5MP సెల్ఫీ కెమెరాని అందించింది. ఈ ఫోన్ `స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది మరియు IP52 రేటెడ్ Water-Repellent తో వస్తుంది కాబట్టి నీటి తుంపర్ల నుండి రక్షిస్తుంది. ఈ ఫోన్ లో పెద్ద 5000 mAh బ్యాటరీని అందించింది. ఈ ఫోన్ లో 2X2 MIMO నెట్ వర్క్ సపోర్ట్ ని కూడా ఇచ్చింది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo