ఎల్ జి వి40 థిన్ క్యూ ట్రిపుల్ రియర్ – కెమెరా , నోచ్ డిస్ప్లే మరియు డ్యూయల్ – ఫ్రెంట్ కెమరాతో రానుందని ప్రెస్ రెండెర్స్ అంచనావేస్తున్నారు

ఎల్ జి వి40 థిన్ క్యూ ట్రిపుల్ రియర్ – కెమెరా , నోచ్ డిస్ప్లే మరియు డ్యూయల్ – ఫ్రెంట్  కెమరాతో రానుందని ప్రెస్ రెండెర్స్ అంచనావేస్తున్నారు
HIGHLIGHTS

లీకైన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క చిత్రాల ద్వారా, క్షితిజ సమాంతరంగా అనుసంధానించిన ట్రిపుల్ - రియర్ కెమెరా సెటప్ మరియు డ్యూయల్-ఫ్రంట్ కెమెరా సెన్సార్లను సూచిస్తుంది: ప్రెస్ రెండర్స్.

జి7 థిన్Q, జి7 + థిన్Q, వి30ఎస్ థిన్Q మరియు వి35 థిన్Q తరువాత, 2018  LG యొక్క నాల్గవ ప్రధాన స్మార్ట్ ఫోన్ గా వి40 గా భావిస్తున్నారు. రాబోయే స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక భాగంలో ఒక ట్రిపుల్-రేర్ కెమెరా సెటప్ తో స్మార్ట్ ఫోన్ రానుందని ముందే రెండర్స్ సూచించిన విధంగా ఇదే ఆ ఫోన్ అయివుండొచ్చని ప్రెస్ రెండెర్స్ అంచనా వేస్తున్నారు. పై చిత్రాలలో రాబోయే డివైజ్ యొక్క ప్రెస్ అందించేవిగా  MySmartPrice ద్వారా పోస్ట్ చేయబడిన చిత్రాలుగా పేర్కొంటున్నారు. రిపోర్టు ప్రకారం, హ్యాండ్ సెట్లో మూడు క్షితిజ సమాంతరంగా అమర్చిన కెమెరాలు మరియు ఒక LED ఫ్లాష్ దాని గ్లాస్ బ్యాక్ లో ప్రదర్శించబడ్డాయి, ఇది ఒక మిర్రర్డ్ ఫినిష్ ని అందిస్తుంది. ఫింగర్ ప్రింట్ రీడర్ LG మరియు V40 ThinQ బ్రాండింగ్ తో కెమెరాలకు కొద్దిగా కింద వైపు కనిపిస్తుంది.

https://static.digit.in/default/33a3de1e1e053b47b5f74e3e3c7ef7cede1da221.jpeg

ప్రెస్ రెండెర్స్ ప్రకారం, ఎల్ జి వి40 థిన్ క్యూ నవంబర్ 16, 2018 న ఆవిష్కరించనుంది. అయితే, తేదీ ఇంకా కొన్ని నెలల దూరంలో ఉంది మరియు ఈ ప్రణాళికలలో మార్పు చేసే  అవకాశం ఉంది. డిస్ప్లే కి సంబంధించి, స్మార్ట్ ఫోన్ ఒక OLED లేదా ఒక P-OLED స్క్రీన్తో వంగిన అంచులు మరియు పైభాగంలో ఒక నోచ్ తో ఉంటుంది. ఒక 'నోచ్ ' స్క్రీన్తో ఉన్న చాలా స్మార్ట్ ఫోన్ల వలె, హైడ్ చేసే ఒక ఎంపికతో రాబోయే అవకాశం ఉంది, అందుకే నోచ్  ప్రధాన ఆకర్షణలో కనిపించకుండా ఉంటుంది. స్మార్ట్ ఫోన్లో నోచ్ 2 కెమెరాలను కలిగివుంటుంది, ఐఆర్ బ్లాస్టర్తో 3D పేస్ డిటెక్షన్ ఎనేబుల్ చేయగలదు.

స్మార్ట్ ఫోన్లో కెమెరాల గురించి అదనపు సమాచారం లేదు, అయితే, కంపెనీ సెన్సార్లలో ఒకదానికి విస్తృత – కోణం (వైడ్-యాంగిల్) లెన్స్ ను ఉపయోగించాలని భావిస్తున్నారు. SIM స్లాట్ మరియు పవర్ బటన్ పరికరం యొక్క కుడి అంచున చూడవచ్చు, అయితే వాల్యూమ్ రాకర్ ఎడమవైపు అంచున ఉన్న మరొక బటన్తో పాటు అంకితమైన గూగుల్  అసిస్టెంట్ బటన్గా భావిస్తున్నారు. దిగువ అంచులో USB టైప్-సి పోర్ట్, స్పీకర్ మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి. ఎల్ జి వి40 థిన్ క్యూ ప్రధానంగా స్నాప్డ్ 845 SoC చే శక్తిని పొందుతుంది.

కంపెనీ  గతంలో, ఎల్ జి  వి35 థిన్ క్యూ దాని V సిరీస్ డివైజ్లను ప్రవేశపెట్టింది. స్మార్ట్ఫోన్ వేగమైన పనితీరు అందించేందుకు మరియు 'మెరుగైన' ఫోటోగ్రఫీ, ఆడియో మరియు AI ఆధారిత కార్యాచరణలతో వస్తుంది. ఈ డివైజ్  IP68 తో దుమ్ము మరియు నీరు నిరోధక మరియు MIL-STD 810G ధ్రువీకరణతో వస్తుంది. ఇది 64జీబీ అంతర్గత స్టోరేజితో పాటు 6జీబీ ర్యామ్ అందిస్తుంది. 128జీబీ స్టోరేజి  ఆన్బోర్డ్ తో V35 + థిన్ క్యూ కూడా ఉంది. మరింత అంతర్గత స్టోరేజి తప్ప, V35 థిన్ క్యూ మరియు V35+ థిన్ క్యూ మధ్య తేడా లేదు. న్యూ అరోరా బ్లాక్ మరియు న్యూ ప్లాటినం గ్రే రంగు వేరియంట్లలో ఈ డివైజ్లను ప్రారంభించబడ్డాయి మరియు US లో $ 900 (సుమారు రూ. 60,720) ధారగా ఉండవచ్చు.

ఇమేజ్ సోర్స్

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo