LG W41 Series Launch: ఆకట్టుకునే డిజైన్, 48MP క్వాడ్ కెమెరా మరిన్ని ఫీచర్లతో వచ్చింది
LG సంస్థ, తన కొత్త LG W41 స్మార్ట్‌ఫోన్ సిరీస్ ను లాంచ్ చేసింది.
ఈ LG W41 Series ను బడ్జెట్ సెగ్మెంట్ లో ప్రకటించింది.
W41, W41+ మరియు W41 Pro స్మార్ట్‌ఫోన్ లను తీసుకొచ్చింది.
LG సంస్థ, తన కొత్త LG W41 స్మార్ట్‌ఫోన్ సిరీస్ ను లాంచ్ చేసింది. ఈ LG W41 Series ను బడ్జెట్ సెగ్మెంట్ లో ప్రకటించింది. ఈ LG W41 Series నుండి W41, W41+ మరియు W41 Pro స్మార్ట్‌ఫోన్ లను తీసుకొచ్చింది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్ లు కూడా 48MP క్వాడ్ కెమెరా, పెద్ద బ్యాటరీ, పంచ్ హోల్ డిస్ప్లే మరియు మరిన్ని ప్రత్యేకతలతో పాటుగా మంచి ఆకట్టుకునే డిజైన్ తో లాంచ్ చేయడ్డాయి. ఈ ఫోన్ యొక్క పూర్తి వివరాలను పరిశీలిద్దాం.
SurveyLG W41 Series స్మార్ట్‌ఫోన్స్ ధరలు
ఈ LG W41 Series స్మార్ట్‌ఫోన్స్ యొక్క ప్రారంభ ధర రూ. 13,490 రూపాయలు.
LG W41 Series: స్పెసిఫికేషన్స్
LG W41 Series స్మార్ట్‌ఫోన్స్ 20:9 ఎస్పెక్ట్ రేషియాతో పొడవైన 6.55 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంటాయి. ఈ డిస్ప్లే పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది మరియు ఈ పంచ్ హోల్ లో సెల్ఫీ కెమెరా వుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్స్, MediaTek Helio G35 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తాయి. ఈ LG W41 Series నుండి వచ్చిన మూడు స్మార్ట్‌ఫోన్స్ కూడా ఒకేవిధమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉంటాయి. అయితే, వీటి స్టోరేజ్ మరియు ర్యామ్ లలో మాత్రం తేడాలు ఉంటాయి. W41, 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో, W41+ ఫోన్ 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో మరియు W41 Pro 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వుంటుంది. ఇక ఈ మూడు ఫోన్ లలో కూడా 512 వరకూ మెమొరీ కార్డు అప్షన్ ఇవ్వబడింది.
ఇక కెమెరాల విషయానికి వస్తే, ఈ ఫోన్లలో వెనుక క్వాడ్ కెమెరా ఇవ్వబడింది. ఇందులో, 48MP మైన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్, 2MP డెప్త్ కెమెరా మరియు 5MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. ముందుభాగంలో వున్నా పంచ్ హోల్ లో 8MP సెల్ఫీ కెమెరాని అందించారు. LG W41 Series ఫోన్ పెద్ద 5,000mAh బాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మరియు USB టైప్-C పోర్టుతో కలిగివున్నాయి. ఇందులో లాక్ సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ మరియు పేస్ అన్లాక్ కూడా వుంది. ఈ మ్యాజిక్ బ్లూ మరియు లేజర్ బ్లూ వాటి రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ఈ ఫోన్స్ ఆండ్రాయిడ్ OS తో వస్తాయి.