Lava Bold N1 5G: 7 వేల బడ్జెట్ ధరలో 4K Video కెమెరాతో లాంచ్ అయ్యింది.!
Lava Bold N1 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు లావా విడుదల చేసింది
స్మార్ట్ ఫోన్ ను అండర్ రూ. 7,000 రేటుతో అందించి అందరిని ఆశ్చర్య పరిచింది
ఈ ఫోన్ 4K Video సపోర్ట్ కలిగి ఉంటుందని లావా తెలిపింది
Lava Bold N1 5G స్మార్ట్ ఫోన్ ను ఈరోజు లావా విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అండర్ రూ. 7,000 రేటుతో అందించి అందరిని ఆశ్చర్య పరిచింది. దసరా మరియు దీపావళి పండుగ సందర్భంగా బడ్జెట్ యూజర్ ను టార్గెట్ చేస్తూ ఈ బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ స్టన్నింగ్ డిజైన్ మరియు ఫీచర్స్ తో ఆకట్టుకుంది. ఈ ఫోన్ 4K Video సపోర్ట్ కలిగి ఉంటుందని లావా తెలిపింది.
SurveyLava Bold N1 5G : ప్రైస్
లావా బోల్డ్ ఎన్1 5జి స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 7,499 రూపాయల ధరతో లాంచ్ చేసింది. ఇది 4 జీబీ + 64 జీబీ కోసం నిర్ణయించిన ధర కాగా 4 జీబీ + 128 జీబీ వేరియంట్ ను రూ. 7,999 ధరతో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పై మంచి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 750 రూపాయల తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ సేల్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ, ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి సేల్ అవుందని చెబుతోంది. ఈ ఫోన్ లాంచ్ టీజర్ ఇమేజ్ పై సేల్ లోగో ని కూడా అందించింది.
Also Read: Flipkart The Big Billion Days సేల్ డేట్ అనౌన్స్ చేసింది: Smart Tv లపై భారీ డిస్కౌంట్ కన్ఫర్మ్.!
Lava Bold N1 5G : ఫీచర్స్
లావా బోల్డ్ ఎన్1 5జి స్మార్ట్ ఫోన్ ను స్టన్నింగ్ మరియు ప్రీమియం గ్లాసీ బ్యాక్ డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ లభిస్తున్న బడ్జెట్ ధరలో ఈ డిజైన్ మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ బిగ్ డిస్ప్లేని HD రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. లావా ఈ ఫోన్ ను Unisoc T765 ఆక్టా కోర్ చిప్ సెట్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 4 జీబీ ఫిజికల్ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ కూడా అందించింది.

ఈ లావా స్మార్ట్ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కలిగిన 13MP సెలి కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 15 పై నడుస్తుంది మరియు బ్లోట్ వేర్ ఫ్రీ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ లో ఫేస్ అన్లాక్ మరియు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అందించింది. బోల్డ్ ఎన్1 5జి స్మార్ట్ ఫోన్ 5000 mAhబిగ్ బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది.